Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 7, 2022

Special Education: A 'special education' teacher is mandatory in schools


 Special Education: పాఠశాలల్లో ‘ప్రత్యేక విద్య’ టీచర్‌ తప్పనిసరి

* విద్యాహక్కు చట్టానికి కేంద్రం సవరణలు

 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యను అందించేందుకు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులను(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు) తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఓ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఉండాలని పేర్కొంటూ విద్యాహక్కు చట్టానికి తాజాగా సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎడ్ల నవీన్‌ నికోలస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలు అమలుచేయాలంటూ సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రత్యేక ప్రాజెక్టు డైరెక్టర్లు, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శులకు సూచించారు. ఒకటి నుంచి అయిదు తరగతుల్లో ప్రతి 10 మంది దివ్యాంగులైన విద్యార్థులకు, ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు తప్పనిసరిగా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచరు ఉండాలని స్పష్టం చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు లేని ప్రాంతాల్లోని పాఠశాలలను ప్రత్యేక క్లస్టర్లుగా ఏర్పాటు చేసి నియమించేందుకు వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుడికి నాలుగు పాఠశాలలకు మించి కేటాయించకూడదని, ఆయా పాఠశాలలన్నీ అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని ఆ ఆదేశాల్లో సూచించారు.

Thanks for reading Special Education: A 'special education' teacher is mandatory in schools

No comments:

Post a Comment