Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 8, 2022

WhatsApp: Good news for WhatsApp users.. Important privacy option ..


 WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కీలకమైన ప్రైవసీ ఆప్షన్ వచ్చేసింది..

ప్రైవసీ విషయంలో వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వినియోగదారుల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను విడుదల చేసింది వాట్సాప్. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా కనిపించే ఆప్షన్‌ను హైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అది వాట్సప్‌లో కీలకమైన అప్‌డేట్ అని చెప్పాలి. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరికి తెలియకుండా ప్రైవసీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సిగ్నల్ యాప్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాట్సాప్‌లోనూ అందుబాటులోకి వంచ్చింది. ఇక సిగ్నల్‌లో స్క్రీన్ షాట్ బ్లాకింగ్, హిడెన్ కీబోర్డ్ వంటి ఇతర ప్రైవసీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వాట్సాప్‌లో అలాంటి ఫీచర్స్ లేవు. ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం, వారి గోప్యత కోసం ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియకుండా హైడ్ చేయొచ్చు. ఇందుకోసం సెట్టింగ్‌కు వెళ్లి ఫీచర్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియొద్దని ఆ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. అవతలి వారు కూడా ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మీకు తెలియదు. లాస్ట్ సీన్ ఫీచర్ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ తాజా అప్‌డేట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

అయితే, ప్రతీ ఫీచర్‌కు ఒక ప్రతికూలత ఉన్నట్లుగానే.. దీనికీ ఒకటి ఉంది. లేటెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌తో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. వాట్సాప్‌లో ప్రైవసీ విభాగంలో వినియోగదారుడు మూడు ప్రైవసీ ఆప్షన్స్‌ను ఆన్‌లైన్, ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్ హైడ్ చేస్తే.. అవతలి వారు బ్లాక్ చేశారా? లేదా? అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇందుకు మరో ఆప్షన్ ఉంది. మెసేజ్ పంపిస్తే.. రెండు మార్కులు చూపిస్తే వారు బ్లాక్ చేయలేదని, ఒక మార్క్ మాత్రమే కనిపించి మెసేజ్ డెలివరీ కాకపోతే.. అవతలి వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఇక మొబైల్ డేటా ఆఫ్‌లో ఉన్నప్పుడు చాట్‌ ఒక చెక్ మార్క్‌ను మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ బ్లాక్ చేయనట్లయితే రిసీవర్ డేటా ఆన్ చేయగానే.. చాట్ రెండు చెక్ మార్క్‌లను చూపిస్తుంది.

వాట్సాప్ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఈ ఫీచర్‌ను వినియోగించొచ్చు. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను అవతలి వ్యక్తులకు కనిపించకుండా హైడ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ముందుగా వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయాలి.

2. కుడి వైపున పైన మూలలో మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి.

3. అందులో సెట్టింగ్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి.

4. ఆ తరువాత అకౌంట్స్‌కి వెళ్లి.. ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

5. ఇప్పుడు లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

6. ఇప్పుడు 'ఆన్‌లైన్' అని ఉన్న చోట Every One, Same as Last Seen అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.

7. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరూ చూడొద్దు అనుకుంటే Same as Last Seen అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఇలా ప్రైవసీ సెట్టింగ్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవచ్చు.

Thanks for reading WhatsApp: Good news for WhatsApp users.. Important privacy option ..

No comments:

Post a Comment