APRGUKT IIIT Admissions 2022 Phase -4 Selection List
AP RGUKT Selection: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-4 ఎంపిక జాబితా విడుదల
* నవంబర్ 27న కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి నాలుగో దఫా(ఫేజ్-4) అర్హులైన అభ్యర్థుల జాబితా నవంబర్ 23న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 125 సీట్ల భర్తీకి నవంబరు 27న నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో జనరల్ కోటాలో 120, ఎన్‌సీసీలో 3, సీఏపీలో 1, ఓహెచ్ కోటా కింద 1 సీట్లు... మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం 125 సీట్లు మిగిలిపోయాయన్నారు. ఎన్‌సీసీ, క్యాప్, ఓహెచ్ కోటా సీట్లు సైతం నవంబర్ 27నే భర్తీ చేస్తామన్నారు. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఫేజ్ 4 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-4 ఎంపిక జాబితా
కేటగిరీ వారీగా కటాఫ్ మార్కు వివరాలు
Thanks for reading APRGUKT IIIT Admissions 2022 Phase -4 Selection List
No comments:
Post a Comment