Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 25, 2022

Chief Minister Jagan assured AP government employees.


 ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ కీలక హామీ..!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ కీలక హామీ ఇచ్చారు . ఉద్యోగ సంబంధిత అంశాల పైన ముఖ్యమంత్రి జగన్ తో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు.

గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్ ౩ ను గ్రేడ్ 2కి మార్చాలని నేతలు ముఖ్యమంత్రిని కోరారు. దీనికి అంగీకరించిన ముఖ్యమంత్రి.. 11వేల మంది గ్రేడ్ 3సర్వేయర్లను గ్రేడ్ 2లోకి మార్చేందుకు నిర్ణయించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షిస్తున్న డీఏ  పైన సీఎం హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగ సంఘ నేతలు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ  జనవరిలో ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. దీంతో పాటుగా.. గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని బదిలీలకు అనుమతించాలని సీఎం ను మరోసారి కోరినట్లు వివరించారు. గతంలో సెప్టెంబర్ లోనే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగడం వల్ల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు ఆగాయని ముఖ్యమంత్రి తమతో చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.

గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలను వచ్చే ఏప్రిల్ లో చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘ నేతలు కూడా సీఎంతో సమావేశమయ్యారు. గ్రామ సర్వేయర్లు ,వీఆర్వోల మధ్య ఉన్న గ్రేడ్ తేడా ఉందనే విషయాన్ని నేతలు ముఖ్యమంత్రికి వివరించారు. సర్వేయర్లు,వీఆర్వోల మధ్య ఉన్న గ్రేడ్ లను సరిచేయాలని ముఖ్యమంత్రిని కోరగా.. ఆయన అందుకు అంగీకరించారని చెప్పారు. గ్రేడ్3సర్వ్యర్లను గ్రేడ్ 2సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. ముఖ్యమంత్రి తాజాగా తెలిపిన ఆమోదంతో 10 వేల పైగా గ్రేడ్ ౩ సర్వేయర్లు గ్రేడ్2సర్వేయర్లుగా మారి సబ్ది పొందుతారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. దీంతో, జనవరిలో సంక్రాంతి నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ  విడుదలయ్యే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Thanks for reading Chief Minister Jagan assured AP government employees.

No comments:

Post a Comment