Cholesterol: మీ శరీరంలో ఈ 4 ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తున్నాయా? అది దాని ఎఫెక్టే.. బీ అలర్ట్..
చెడు కొలెస్ట్రాల్ పెరగడం అంటే.. ప్రాణాలకు ముప్పు ఉన్నట్లే. దీని కారణంగా రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
ఇది అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌కు దారి తీస్తుంది. కొలెస్ట్రాల్ కాలేయంలో ఉత్పత్తి అయ్యే జిగట పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అయితే, ఎక్కువ నూనె పదార్థాలు, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అది ప్రమాదానికి దారితీస్తుంది.
అయితే కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లయితే వెంటనే గుర్తించాలి. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కొన్ని ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఛాతీ నొప్పి: అధిక కొలెస్ట్రాల్ ముఖ్యమైన లక్షణం ఇది. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ నొప్పి కొన్ని రోజులు ఉంటుంది. ఛాతీ నొప్పి కూడా గుండె జబ్బుల లక్షణం. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది.
2. విపరీతంగా చెమటలు పట్టడం: వేసవిలో, ఎక్కువ వర్కవుట్ చేసిన తర్వాత చెమటలు పట్టడం సహజం. కానీ సాధారణ పరిస్థితుల్లో లేదా శీతాకాలంలో విపరీతంగా చెమటలు పట్టడం ప్రారంభమైతే.. అది అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల లక్షణాలు అని గ్రహించాలి.
3. బరువు పెరగడం: మీ బరువు వేగంగా పెరుగుతుంటే, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్లనే అని తెలుసుకోవాలి. ఈ లక్షణాన్ని విస్మరించవద్దు. శారీరక శ్రమను వీలైనంతగా పెంచాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం ప్రారంభించాలి.
4. చర్మం రంగు మారడం: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం అనేక సంకేతాలను పంపుతుంది. ఇందులో చర్మం రంగు మారడం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో చర్మంపై పసుపు దద్దుర్లు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయడం చాలా ముఖ్యం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Thanks for reading Cholesterol: Are you showing these 4 dangerous symptoms in your body?
No comments:
Post a Comment