మీ ఆధార్‌తో వేరేవాళ్లు సిమ్ తీసుకున్నారా?
బ్యాంకు ఖాతా తెరవాలన్నా, వైఫై కనెక్షన్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది.
దీని విషయంలో ఎన్నో భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఈ 12 అంకెల ఆధార్ సంఖ్యను కొందరు మనకు తెలియకుండానే దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు- సిమ్ కార్డు పొందటానికి దీన్ని వాడుకొని ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితిని నివారించటానికి కేంద్ర ప్రభుత్వం మన పేరుతో రిజిస్టరై, ఇంకా యాక్టివ్‌గా ఉన్న సిమ్‌ల వివరాలు తెలుసుకోవటానికి టాఫ్-కాప్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ఆరంభించింది. దీని ద్వారా మన పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ కనెక్షన్లను తేలికగా గుర్తించొచ్చు. ప్రస్తుతమిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది.
తనిఖీ ఇలా..
* ముందు https://tafcop.dgtelecom.gov.in/ లోకి వెళ్లాలి.
* మొబైల్ నంబరును ఎంటర్ చేసి 'రిక్వెస్ట్ ఓటీపీ' ఆప్షన్ మీద నొక్కాలి.
* ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబరును ఎంటర్ చేసి 'వాలిడేట్'పై క్లిక్ చేయాలి.
* మన ఆధార్ సంఖ్య మీద జారీ అయిన మొబైల్ నంబర్లు/సిమ్‌ల వివరాలన్నీ కనిపిస్తాయి.
* వీటిల్లో మనకు సంబంధించని నంబర్లు ఉంటే రిపోర్టు చేయొచ్చు కూడా. ఇందుకు ఆ నంబర్లను ఎంచుకోవాలి. దిస్ ఈజ్ నాట్ మై నంబర్, నాట్ రిక్వయిర్డ్, రిక్వయిర్డ్.. ఆప్షన్లలో అవసరమైనది సెలెక్ట్ చేసుకొని, రిపోర్టు చేయాలి. అప్పుడు మన రిపోర్టును నమోదు చేసుకున్నట్టు మొబైల్ ఫోన్‌కు సందేశం వస్తుంది.
Thanks for reading Did someone else get a SIM with your Aadhaar?
No comments:
Post a Comment