Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 25, 2022

Indian Navy Agniveer (SSR) – 01/2023 (May 2023) – Apply Online for 1400 Posts


 Indian Navy: ఇండియన్ నేవీలో 1400 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. డిసెంబర్‌ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

అగ్నివీర్ (సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌- ఎస్‌ఎస్‌ఆర్‌): 1400 పోస్టులు (పురుషులు- 1,120, మహిళలు- 280)

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా.. కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: అభ్యర్థి 01.05.2002 – 31.10.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది మే నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్… నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 08-12-2022

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17-12-2022.

శిక్షణ ప్రారంభం: 2023, మే నెలలో.

Website Here

Notification Here

Thanks for reading Indian Navy Agniveer (SSR) – 01/2023 (May 2023) – Apply Online for 1400 Posts

No comments:

Post a Comment