Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification
710 Government Jobs in Public Sector Bank || Last date : November 21, 2022
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు
‣ 710 ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటన
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుంచి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ప్రత్యేక అధికారుల పోస్టులకు దరఖాస్తు చేసుకుని సమగ్రంగా సన్నద్ధమై పరీక్ష రాస్తే... బ్యాంకులో పాగా వేయవచ్చు!
ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి.
గత ఏడాది 1800 కంటే ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది 710 పోస్టులకు మాత్రమే ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు గడువు తేదీ నాటికి అభ్యర్థులు సంబంధిత అర్హత పరీక్ష పాసై ఉండాలి.
పెరిగిన ప్రాధాన్యం
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఇటీవలి కాలంలో ప్రాధాన్యం పెరిగింది. గతంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని పనులనూ ప్రొబేషనరీ ఆఫీసర్లే చేసేవారు. లోన్లు, అకౌంట్స్, క్యాష్, అడ్మినిస్ట్రేషన్ విధులన్నీ కూడా నిర్వర్తించేవారు. ఇప్పుడు అలాకాకుండా ప్రతి విభాగంలోనూ స్పెషలైజ్డ్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. సుమారుగా పదేళ్ల నుంచీ ప్రత్యేక అధికారులను ఎంపిక చేస్తున్నారు.
‣ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: రైతుకు రుణం మంజూరు చేయాలి అనుకుందాం. బ్యాంకులో అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటే... రైతు ఏ పంటలు వేస్తున్నాడు. వాటికి మార్కెట్లో గిరాకీ ఉంటుందా లేదా.. ఆ పంటను అమ్మి రుణం తీర్చగలగే స్థోమత అతడికి ఉంటుందా లేదా అనే విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం చేయడానికి విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
‣ లా ఆఫీసర్: బ్యాంకుకు సంబంధించిన న్యాయ సంబంధిత వ్యవహారాలను చూస్తారు.
‣ మార్కెటింగ్ ఆఫీసర్: ప్రస్తుతం బ్యాంకులకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు బాగా విస్తరించాయి. ప్రైవేటు బ్యాంకులు వచ్చాక చాలామంది వినియోగదారులు అటువైపు వెళుతున్నారు. అలాకాకుండా ప్రైవేటు బ్యాంకులకు దీటుగా సేవలను అందించాలంటే మార్కెటింగ్ నిపుణుల అవసరం చాలా ఉంటుంది. వివిధ రకాల రుణాలు, సేవల విషయంలో కస్టమర్లను ఆకట్టుకునేలా చేయడానికి మార్కెటింగ్ నిపుణులు అవసరం అవుతారు.
ఎంపిక ఎలా?
ప్రిలిమినరీ.. అర్హత పరీక్షగా ఉంటుంది. మెయిన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 80:20 నిష్పత్తిలో మార్కులను లెక్కిస్తారు. లా, రాజ్‌భాష అధికారి పోస్టులకు పరీక్ష విధానం ఒకేలా ఉంటుంది. మిగిలిన నాలుగు పోస్టులకు మరో విధానం ఉంటుంది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెకుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్టులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది.
‣ మెయిన్ పరీక్షలో ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెకులకు సంబంధినవే ఉంటాయి. అవన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యార్థులు చదివిన సబ్జెక్టులే కాబట్టి ప్రిలిమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
‣ ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 44
‣ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 516
‣ రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 25
‣ లా ఆఫీసర్ (స్కేల్-1): 10
‣ హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 15
‣ మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 100
ఇవి గమనించండి
‣ దరఖాస్తుదారుల వయసు 01.11.2022 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
‣ దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
‣ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
‣ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21.11.2022.
‣ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: 24.12.2022, 31.12.2022.
‣ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 29.01.2023.
‣ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2023.
‣ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2023.
‣ ఉద్యోగ నియామకాలు: ఏప్రిల్, 2023.
‣ వెబ్‌సైట్: https://www.ibps.in/
పకడ్బందీగా సన్నద్ధత
ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 50 రోజుల సమయం ఉంది. మెయిన్స్‌కు మూడు నెలల సమయం ఉంటుంది.
‣ ఈ పరీక్ష ప్రత్యేకత ఏమిటంటే ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో వేర్వేరు సబ్జెక్టులు ఉండటం! సాధారణంగా బ్యాంక్ పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ సన్నద్ధత ఒకేవిధంగా ఉంటాయి. కానీ ఈ పరీక్షలో వేర్వేరు సబ్జెక్టులు నిర్దేశించారు.
‣ ప్రధానంగా ప్రిలిమ్స్ పైనే దృష్టిని కేంద్రీకరించాలి. మెయిన్స్‌లో వచ్చే సబ్జెక్టు సంబంధిత అంశాలను కాలేజీ స్థాయిలో చదువుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అందుకే ముందుగా ప్రిలిమ్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
‣ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్... అరిథ్‌మెటిక్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ను కలిపి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటారు.
‣ అరిథ్‌మెటిక్, ఇంగ్లిష్, రీజనింగ్ బాగా నేర్చుకుంటే ప్రిలిమ్స్‌లో రాణించవచ్చు. 20 నుంచి 25 రోజులు ప్రిలిమ్స్‌కు సన్నద్ధం కావాలి. ఇంగ్లిష్‌లో టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ ఆధారిత ప్రశ్నలను పరీక్షలో ఎలా ఇస్తున్నారో చూడాలి.
‣ పాత ప్రశ్నపత్రాల ప్రాక్టీస్ వల్ల ఫలితం ఉంటుంది. అలాగని ఐబీపీఎస్ ప్రశ్నపత్రాలనే సాధన చేయాలని లేదు. ఏ బ్యాంకు ప్రశ్నపత్రాలనైనా సాధన చేయొచ్చు. ఉదాహరణకు ఎస్‌బీఐ క్లర్క్స్, ఎస్‌బీఐ పీఓ, ఇతర బ్యాంకుల ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు.
‣ ఇంగ్లిష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షû, ఒకాబ్యులరీని బాగా చూసుకోవాలి. గ్రామర్ బాగా తెలిస్తే జంబుల్డ్ సెంటెన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్‌ను బాగా రాయగలుగుతారు.
‣ ముందుగా పాత ప్రశ్నపత్రాల్లోని గ్రామర్‌ను సాధన చేయాలి. సందేహం వచ్చినచోట ఆగి.. సంబంధిత గ్రామర్ పాఠాన్ని ప్రత్యేకంగా చదివితే బాగా అర్థం అవుతుంది.
‣ రోజూ 150 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేసేలా సాధన చేయాలి. అలా చేయలేకపోతే ఎక్కడ ఎక్కువ సమయం పడుతుందో చూసుకోవాలి. తప్పులను సరిచూసుకుని అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.
‣ రోజూ 10 గంటల సమయాన్ని ప్రిలిమ్స్‌కు కేటాయించాలి. మ్యాథమెటిక్స్‌కు 4 గంటలు, రీజనింగ్‌కు 3 గంటలు, ఇంగ్లిష్‌కు 2 గంటలు, జనరల్ అవేర్‌నెస్‌కు 1 గంట సమయం కేటాయించగలిగితే ఫలితం ఉంటుంది.
తగినంత సమయాన్ని కేటాయించడంతోపాటు.. ‘ఈ ఉద్యోగం నాకెంతో ముఖ్యం.. దీన్ని సాధించి తీరాలి’ అనే ధ్యేయంతో చదవాలి. పరీక్షలో విజయం సాధించాలంటే.. సెల్ఫ్ మోటివేషన్, ఏకాగ్రత చాలా అవసరం.
Thanks for reading Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification
No comments:
Post a Comment