KVS Recruitment 2022 – Apply Online for 4014 PGT, TGT, Head Master and Other Teaching and Non Teaching Posts
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న..4,014లకు పైగా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆపీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందీ, ఇంగ్లిష్, హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, సంస్కృతం, సోషల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం:05.11.22
దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ: 16.11.22
అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ:. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ప్రిన్సిపాల్ పోస్టులు: 278
వైస్ ప్రిన్సిపల్ పోస్టులు: 116
ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు: 7
సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 22
పీజీటీ పోస్టులు: 1200
టీజీటీ పోస్టులు: 2154
హెడ్ మాస్టర్ పోస్టులు: 237
ముఖ్యమైన లింకులు:
Complete Notification: Click Here
Thanks for reading KVS Recruitment 2022 – Apply Online for 4014 PGT, TGT, Head Master and Other Teaching and Non Teaching Posts
No comments:
Post a Comment