Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 29, 2022

KVS Recruitment 2022: Notification for 13,404 posts released - Steps to apply online on kvsangathan.gov.in | Kendriya Vidyalaya Vacancy, Jobs


 KVS Recruitment 2022: Notification for 13,404 posts released - Steps to apply online on kvsangathan.gov.in | Kendriya Vidyalaya Vacancy, Jobs

KVS Kendirya Vidyalaya Sangathan


Click here to download admit card for the post of Asstt. commissioner, Principal, Vice-Principal and PRT (Music) - Direct Rectt 2022l




◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Kendriya Vidyalaya: ఫిబ్రవరి 7 నుంచి కేవీ నియామక పరీక్షలు

* మార్చి 6 వరకు నిర్వహణ

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో మొత్తంగా 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, వైస్‌ ప్రిన్సిపల్‌, ప్రిన్సిపల్‌, మ్యూజిక్‌ టీచర్‌, లైబ్రేరియన్‌, ఇతర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్ణయించింది.

పోస్టులు.. సీబీటీ పరీక్ష తేదీలివే..

అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుల(52)కు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 7న జరగనుండగా.. ప్రిన్సిపల్‌(239) పోస్టులకు ఫిబ్రవరి 8; వైస్‌ ప్రిన్సిపల్‌(203) & పీఆర్‌టీ (మ్యూజిక్‌-233) ఫిబ్రవరి 9, టీజీటీ (3,176) పోస్టులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు; పీజీటీ (1,409) పోస్టులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు; ఫైనాన్స్‌ ఆఫీసర్‌(6), ఏఈ(సివిల్‌-2), హిందీ ట్రాన్స్‌లేటర్‌(11) ఉద్యోగాలకు ఫిబ్రవరి 20న; పీఆర్‌టీ ఉద్యోగాలకు(6,414) ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల(702)కు మార్చి 1 నుంచి 5 వరకు; స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌- 2 (54) ఉద్యోగాలకు మార్చి 5; లైబ్రేరియన్ (355)‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్(156)‌, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(322) ఉద్యోగాలకు మార్చి 6న పరీక్ష నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన  సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ వీక్షించాలని సూచించింది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 5న మొదలైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 2తో ముగిసింది.

KVS RECRUITMENT CBT SCHEDULE HERE

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Kendriya Vidyalaya: కేవీల్లో 13,404 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వారికి గుడ్‌న్యూస్‌. దరఖాస్తు గడువ పొడిగిస్తున్నట్టు  కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ వెల్లడించింది. 

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) భారీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 13,404 ఉద్యోగాలకు రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకొంటున్నారు. డిసెంబర్ 5న మొదలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ  డిసెంబర్ 26 తో ముగియనుండటంతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులకు ఉపశమనం కలిగించేలా దరఖాస్తు గడువును జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేశారు. విద్యార్హత, వయసు, పని అనుభవం తదితర విషయాల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ జాయింట్‌ కమిషనర్‌ (అడ్మిన్‌-1) స్పష్టం చేశారు.

గమనించండి!

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు పొడిగించిన తేదీ: జనవరి 2

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌.

దరఖాస్తు ఫీజు: పోస్టును బట్టి    రూ.1200-2300 వరకు చెల్లించాలి.

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/

KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya) 13,404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలు, ఎంపిక ప్రక్రియ సహా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 13,404 పోస్టులకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (Kendriya Vidyalaya Sangathan - KVS) నోటిఫికేషన్ వెలువరించింది. టీజీటీ (TGT), పీజీటీ (PGT), పీఆర్‌టీ (PRT), ప్రిన్సిపాల్‍తో పాటు నాన్ టీచింగ్ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. పూర్తి వివరాలు ఇవే.

KVS Recruitment 2022: వివరాలు

డిపార్ట్‌మెంట్: కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS)

ఖాళీల సంఖ్య: 13,404 పోస్టులు (టీచింగ్, నాన్ టీచింగ్)

అప్లికేషన్ విధానం: ఆన్‍లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 5, 2022

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 26, 2022 పొడిగించిన తేదీ: జనవరి 2, 2023

అధికారిక వెబ్‍సైట్: kvsangathan.nic.in

KVS Recruitment 2022: ఖాళీల వివరాలు

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): 1,409

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 3,176

ప్రైమరీ టీచర్ (PRT): 6,414

ప్రిన్సిపాల్: 239

వైస్ ప్రిన్సిపాల్: 203

అసిస్టెంట్ కమిషనర్: 52

పీఆర్‌టీ (మ్యూజిక్): 303

లైబ్రరేరియన్: 355

ఫైనాన్స్ ఆఫీసర్: 6

అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 2

అసిస్టెంట్ సెలెక్షన్ ఆఫీసర్ (ASO) : 156

సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (UDC): 322

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (LDC): 702

హిందీ ట్రాన్స్ లేటర్: 11

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II: 54

మొత్తం ఖాళీల సంఖ్య: 13,404

KVS Recruitment 2022: వయోపరిమితి

పీజీటీ: 40 సంవత్సరాలు మించకూడదు

టీజీటీ/లైబ్రేరియన్: 35 సంవత్సరాలు మించకూడదు

పీఆర్ టీ: 30 సంవత్సరాలు మించకూడదు

KVS Recruitment 2022: అప్లికేషన్ ఫీజ్

యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.1000

ఎస్‍సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: ఉచితం

పేమెంట్ మోడ్: ఆన్‍లైన్

KVS Recruitment 2022: దరఖాస్తు ప్రక్రియ

ముందుగా కేవీఎస్ అఫీషియల్ వెబ్‍సైట్ kvsangathan.nic.in కు వెళ్లాలి.

KVS Teaching & Non-Teaching 2022 వేకెన్సీ లింగ్‍పై క్లిక్ చేయాలి

ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వివరాలు ఫిల్ చేయాలి. ఫొటో, సిగ్నేచర్ అప్‍లోడ్ చేయాలి.

ఆ తర్వాత ఆన్‍లైన్ అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.

పూర్తయ్యాక అప్లికేషన్‍ను డౌన్‍లోడ్ చేసుకోవాలి.

KVS Recruitment 2022: ఎంపిక ప్రక్రియ

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

స్కిల్ టెస్ట్

ఇంటర్వ్యూ

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ ఎగ్జామినేషన్

KVS RECRUITMENT CBT SCHEDULE HERE

Official Website 

Click here to apply for the post of Assistant Commissioner, Principal & Vice Principal in KVS. 

Click here to apply for the post of Post Graduate Teacher (2022) in KVS. 

Click here to apply for the post of Trained Graduate Teacher and Primary Teacher (2022) in KVS. 

Click here to apply for the post of Librarian and Other Non Teaching Posts in KVS.

KVS Recruitment 2022 Complete Notification


KVS RECRUITMENT CBT SCHEDULE HERE


Click here to download admit card for the post of Asstt. commissioner, Principal, Vice-Principal and PRT (Music) - Direct Rectt 2022l


Thanks for reading KVS Recruitment 2022: Notification for 13,404 posts released - Steps to apply online on kvsangathan.gov.in | Kendriya Vidyalaya Vacancy, Jobs

No comments:

Post a Comment