Railway: రైల్వేలో 596 స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్ ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్ చేసుకోండి.
Railway Jobs 2022: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే (CR) కామన్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (GDCE) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చయనున్నారు.
ప్రధానాంశాలు:
ఆర్‌ఆర్‌సీ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022
596 గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్ తదితర పోస్టుల భర్తీ
నవంబర్ 28 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది.
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 596.. స్టెనోగ్రాఫర్ , గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే (CR) కామన్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (GDCE) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చయనున్నారు.
మొత్తం ఖాళీలు: 596
స్టెనోగ్రాఫర్- 4
సీనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్- 154
గూడ్స్ గార్డ్- 46
స్టేషన్ మాస్టర్- 75
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్- 150
జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్- 126
అకౌంట్స్ క్లర్క్- 37
విద్యార్హతలు:
ఈ రైల్వే ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 50 నిమిషాల ట్రాన్స్‌క్రిప్షన్ సమయంతో పాటు 10 నిమిషాల వ్యవధికి నిమిషానికి 80 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం కలిగి ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దాని తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఇతర వెనుకబడిన తరగతులు 45 ఏళ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీ (SC/ST) 47 ఏళ్ల వయోపరిమితి ఉండాలి.
ఎంపిక విధానం
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rrccr.com/ ని చూడటం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభమైంది. నవంబర్ 28 దరఖాస్తులకు చివరితేది.
Thanks for reading RRC Central Railway Recruitment for 596 Goods Guard, Clerk and other posts; Check out details here
No comments:
Post a Comment