Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 15, 2022

WhatsApp: This is the difference between Communities-Groups!


 WhatsApp: కమ్యూనిటీస్‌-గ్రూప్స్‌ మధ్య వ్యత్యాసం ఇదే!

వాట్సాప్‌ కొత్తగా పరిచయం చేసిన కమ్యూనిటీస్‌కు, గతంలో తీసుకొచ్చిన గ్రూప్‌లకు మధ్య తేడాను వివరించాలని  గత కొద్దిరోజులుగా యూజర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ రెండింటి ఫీచర్లను వివరిస్తూ వీడియోను విడుదల చేసింది. 

 వాట్సాప్‌ ఇటీవల కమ్యూనిటీస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు 20 గ్రూపులను ఒకేచోటకి తీసుకురావచ్చు. ఆఫీస్‌ లేదా హౌసింగ్ సొసైటీల్లో చాలా మంది తమ పరిచయస్తులు, సహోద్యోగులతో కలిసి గ్రూపులను నిర్వహిస్తుంటారు. అలాంటి వాటన్నింటినీ ఒకచోటకు తీసుకొచ్చేందుకు కమ్యూనిటీస్‌ను డెవలప్‌ చేసినట్లు వాట్సాప్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ విడుదలైన తర్వాత చాలా మంది యూజర్లు గ్రూప్స్‌తో కమ్యూనిటీస్‌ను పోలుస్తూ.. రెండింటికి మధ్య వ్యత్యాసం గురించి చెప్పాలని ట్విటర్‌ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ కమ్యూనిటీస్‌, గ్రూప్స్‌ మధ్య ఉన్న తేడాను వివరిస్తూ వీడియోను విడుదల చేసింది. 

గ్రూప్స్‌ (Groups)

స్నేహితులు, కుటుంబసభ్యులు, ఆఫీస్‌లో సహోద్యోగులతో మెసేజ్‌, ఆడియో/వీడియోలు షేర్‌ చేసేందుకు, ఒకేసారి ఎక్కువమందితో చాట్‌ చేసేందుకు గ్రూప్స్‌ ఉపయోగపడుతుంది. ఇందులో 1024 మంది సభ్యులుగా ఉండొచ్చు. గ్రూప్‌ సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉంటుంది. ఇందులో ఎవరైనా ఇన్వైట్‌ లింక్‌,  క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ లేదా అడ్మిన్‌ అనుమతితో గ్రూప్‌లో సభ్యులుగా చేరొచ్చు. 

కమ్యూనిటీస్‌ (Communities)

స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్‌మెంట్‌ వంటి చోట్ల సెక్షన్లు, బ్లాక్‌ల వారీగా గ్రూప్‌లను క్రియేట్‌ చేస్తారు.  వాటిలో ఏదైనా సమాచారం షేర్‌ చేసుకోవాలంటే ప్రతి గ్రూప్‌ను సెలెక్ట్ చేసి ఫార్వార్డ్ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీస్‌ను పరిచయం చేశారు. 

20 గ్రూప్‌లను ఒకేసారి కమ్యూనిటీస్‌లోకి తీసుకురావచ్చు. దీంతో కమ్యూనిటీస్‌ అడ్మిన్‌ ఏదైనా సమాచారాన్ని షేర్‌ చేస్తే 20 గ్రూప్‌లలో ఉన్న సభ్యులందరికీ తెలుస్తుంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వాట్సాప్ తెలిపింది. గ్రూప్స్‌ తరహాలోనే ఇందులో కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది. దాంతోపాటు ఒక గ్రూప్‌లోని సభ్యులు మరొక గ్రూప్‌ సభ్యులతో సంభాషించాలా? వద్దా? అనేది కూడా కమ్యూనిటీస్‌ అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


Thanks for reading WhatsApp: This is the difference between Communities-Groups!

No comments:

Post a Comment