Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 21, 2022

Bank Holidays In January 2023


 

Bank Holidays In January 2023

Bank Holidays in January 2023: వామ్మో.. జనవరిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా..?

మరో పది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2022 సంవత్సరాని ముగింపు పలికి 2023 సంవత్సరానికి స్వాగతం పలకాల్సిన తరుణం రాబోతుంది. జనవరి అంటనే పండగ నెల.

జనవరిలో చాలా పండగలు, వేడుకలు ఉన్న కారణంగా సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. వచ్చే నెలలో దాదాపు 15 రోజులు బ్యాంకులు (Bank Holidays) మూతపడనున్నాయి. కాబట్టి ఆయా రోజుల్లో బ్యాంకు పనులు పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి.

జనవరి నెలలో బ్యాంకు సెలవుల (January Bank Holidays) తేదీలు:

జనవరి 1 - న్యూ ఇయర్‌తో పాటు ఆదివారం

జనవరి 2 - మిజోరంలో కొత్త సంవత్సరం సెలవు. ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు

జనవరి 8 - ఆదివారం

జనవరి 11 - మిజోరంలో మిషనరీ డే. ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే

జనవరి 12 - స్వామి వివేకానంద జయంతి. పశ్చిమ్ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు.

జనవరి 14 - మకర సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, అసోం, సిక్కిం, తెలంగాణల్లో బ్యాంకులకు సెలవు.

జనవరి 15- ఆదివారం

జనవరి 16- కనుమ పండగ. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు. అలాగే ఉళవర్ తిరునైల్ సందర్భంగా పుదుచ్చేరి, తమిళనాడులో బ్యాంకులు బంద్

జనవరి 22- ఆదివారం

జనవరి 23- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. అసోంలో బ్యాంకులు బంద్

జనవరి 25- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.

జనవరి 26- రిపబ్లిక్ డే

జనవరి 28- నాలుగో శనివారం

జనవరి 29- ఆదివారం.

జనవరి 31- మీ - డ్యామ్ -మీ-ఫై సందర్భంగా అసోంలో బ్యాంకులు మూసి ఉంటాయి

రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.

ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.

Thanks for reading Bank Holidays In January 2023

No comments:

Post a Comment