CBSE date sheet: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
Update:31.12.22
CBSE: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!
దిల్లీ: సీబీఎస్‌ఈ (CBSE) 10,12 తరగతుల వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాగా.. 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ (CBSE) తాజాగా విడుదల చేసింది. కేవలం ఒకరోజు జరిగే పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. 12వ తరగతి మిగతా పరీక్షలు, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఈ నెల 29న ప్రకటించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.
సీబీఎస్‌ఈ (CBSE) పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని వెల్లడించింది.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
సీబీఎస్‌ఈ(CBSE)10, 12వ తరగతుల పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచిపరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తెలిపింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని వెల్లడించింది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పింది.
Thanks for reading CBSE class 10, 12 exam schedule release
No comments:
Post a Comment