Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 28, 2022

Cibil Score Tips: Are Loans Rejected for Low CIBIL Score? Follow these two tips to check the problem


 Cibil Score Tips: సిబిల్ స్కోర్ తక్కువ ఉందని లోన్స్ రిజెక్ట్ అవుతున్నాయా? ఈ రెండు టిప్స్ పాటిస్తే ఆ సమస్యకు చెక్

మన అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బారిన పడకుండా బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకోవాలని అనుకుంటాం. మనం ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నప్పుడు దానికి సరిపడా డబ్బు మన దగ్గర లేనప్పుడు ఈఎంఐతో తీసుకోవాలని అనుకుంటాం.

కానీ, చాలా సార్లు మీ సిబిల్ స్కోర్ తక్కువుగా ఉందని బ్యాంకులు మన లోన్ రిజెక్ట్ చేస్తుంటాయి. అలాగే బజాజ్, జెస్ట్ మనీ వంటి సంస్థలు కూడా ఈఎంఐ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ కచ్చితంగా ఎక్కువ ఉండాలంటూ మన అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేస్తుంటాయి. దీంతో మన అవసరాలు తీరక, అనుకున్న వస్తువు కొనలేక ఇబ్బందిపడుతుంటాం. అలాంటి సమయంలో సిబిల్ ను ఎలా పెంచాలని బ్యాంకు అధికారులను అడిగితే వారు తమ చేతుల్లో ఏం లేదని చెబుతుంటారు. అయితే మార్కెట్ రంగ నిపుణులు అందరూ ఇబ్బంది పడే సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలో? టిప్స్ చెబుతున్నారు.

సిబిల్ స్కోర్ అంటే మన ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి అని, బ్యాంకులు లేదా ఎన్ బీఎఫ్ సీ ద్వారా లోన్ పొందడానికి సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుందని మార్కెట్ రంగ నిపుణుల వాదన. లోన్ తీసుకునే సమయంలో గతంలో తీసుకున్న లోన్ తాలూకా రీ పేమెంట్స్ ను సమయానికి కట్టకపోతే క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రుణదాతలు డిఫాల్టర్స్ గా గుర్తుంచి అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తారని చెబుతున్నారు. సో అలాంటి వారు లోన్ రీ పేమెంట్స్ చేయడం మంచిదన సూచిస్తున్నారు.

క్రెడిట్ స్కోర్ పెంచుకునే మార్గాలు

చాలా మంది ఒకటి కంటే ఎక్కువ రీపేమెంట్స్ ను కట్టలేకపోతే, ముఖ్యంగా సిబిల్ స్కోర్ పెంచుకోడానికి ముందుగా బాకి పడిన రీపెమేంట్స్ మొత్తం కట్టేయ్యాలి. ఇలాంటి సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రీ పేమెంట్స్ వేరు లోన్ మొత్తం సెటిల్ చేయడం వేరు. కొంతమంది రుణదాతలు లోన్ సెటిల్ చేయడానికి పార్షియల్ పేమెంట్స్ కు అవకాశం ఇస్తారు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ రిపోర్ట్ లో లోన్ తీర్చలేదని వస్తుంది. దీని వల్ల లోన్ సెటిల్ చేసుకున్న ఖాతాదారులు సిబిల్ రిపోర్ట్ ప్రభావితమవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పార్షియల్ పేమెంట్స్ కు ఓకే చెప్పకుండా కొంచె కష్టమైనా రీ పేమెంట్స్ చేస్తూ ఉంటేనే బెటర్.

మనం ప్రస్తుతం వాడే క్రెడిట్ కార్డులో మన లిమిట్ లో కేవలం 30-40 శాతం వరకూ వాడడమే ఉత్తమం. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్ కూడా సిబిల్ స్కోర్ ను ప్రభావితం చేస్తుంది. మన లిమిట్ లో తక్కువ వాడడం వల్ల మనం వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్, లేదా పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో మనకు రీపేమెంట్ కేపబిలిటీ ఉందని లోన్ ఓకే చేస్తారు. ప్రతి నెలా క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి కడితేనే మన సిబిల్ స్కోర్ ఎలాంటి ఢోకా ఉండదని గుర్తుంచుకోవాలి.

అయితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న వెంటనే సిబిల్ స్కోర్ పెరుగుతుందని అనుకోవద్దు. కొన్ని నెలల తర్వాతే సిబిల్ స్కోర్ లో మెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Thanks for reading Cibil Score Tips: Are Loans Rejected for Low CIBIL Score? Follow these two tips to check the problem

No comments:

Post a Comment