Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 25, 2022

CoronaVirus: Alert on Corona.. Preparedness in different states like this... (10 points)


 CoronaVirus: కరోనాపై అలర్ట్‌.. వివిధ రాష్ట్రాల్లో సన్నద్ధత ఇలా... (10 పాయింట్లు)

కరోనా (coronavirus)పై  రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్‌ (Covid 19) విజృంభించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అప్రమత్తతపై టాప్‌ 10 పాయింట్లు ఇవే..

 చైనా, జపాన్‌ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ (Corona Virus) మళ్లీ విజృంభిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం... వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని సూచించింది. చైనా, దక్షిణ కొరియా, జపాన్‌, థాయిలాండ్‌, హాంకాంగ్‌ తదితర దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో అక్కడి నుంచి వచ్చిన వారికి ఆర్‌టీ -పీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉంటూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సన్నద్ధతపై టాప్‌ 10 పాయింట్లు.

హిమాచల్‌ప్రదేశ్‌లో క్రిస్మస్‌ సందర్భంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలు విధించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. 

ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మన్‌కీ బాత్‌లో మాట్లాడిన ఆయన ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం చూస్తున్నామని.. ఈ తరుణంలో మనమంతా జాగ్రత్తగా ఉండటం అవసరమన్నారు. మాస్కులు ధరిద్దాం.. చేతుల్ని శుభ్రం చేసుకుందాం అని పిలుపునిచ్చారు.

వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తమ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ అన్నారు. కరోనా పరీక్షలు చేయడంతో పాటు వ్యాక్సిన్లూ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజూ 45 వేల నుంచి 50 వేల టెస్టులు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్రమూ జాగ్రత్తగా ఉందన్న ఆయన.. బయటి దేశాల నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 

బీఎఫ్‌.7 వేరియంట్‌తో భారత్‌లో అంతగా భయాందోళనలు అవసరం లేదని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు టీకాలు పొందడం ద్వారానో, లేదంటే కొవిడ్‌ బారిన పడటం మూలంగా ఇమ్యూనిటీని కలిగి ఉన్నారని తెలిపారు. చైనాలో కఠిన ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు తక్కువ ఇమ్యూనిటీతో ఉండటం వల్లే అక్కడ వైరస్‌ విజృంభణ అధికంగా ఉన్నట్టు  సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్ అధిపతి డా.జుగల్‌ కిశోర్‌ విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీలంగా ఉందని.. శాస్త్రీయమైన సూచనలు చేస్తోందన్నారు. ఇతర దేశాల్లో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం వ్యూహం రచించనుంది. ఇందులో భాగంగా ఆరోగ్య, విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు సోమవారం సమావేశమై చర్చిస్తారని సీఎం బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. ఆరోగ్యమంత్రి సుధాకర్‌, విపత్తు నిర్వహణ సంస్థ మంత్రి ఆర్‌.అశోక సోమవారం వైద్యరంగ, సాంకేతిక నిపుణులతో భేటీ  అయ్యి వాస్తవ పరిస్థితులపై చర్చిస్తారన్నారు. న్యూ ఇయర్‌ వేడుకలు, పండుగల సీజన్‌ నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు ఖరారు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మన దేశంలో కరోనా పట్ల అంతగా భయపడాల్సిన అవసరం లేకపోయినా అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. 

దిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులను అధికారులు స్వయంగా వెళ్లి సందర్శించనున్నారు. కరోనా వల్ల ఊహించని పరిస్థితులు ఎదురైతే ఏ మేరకు సన్నద్ధత కలిగి ఉన్నారనే అంశాన్ని పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. దిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్‌ సింగ్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు హాజరయ్యారు. ఆస్పత్రుల్లో తగినన్ని పడకలు, ఇతర సామగ్రి సరిపడా ఉన్నాయో లేదో పరిశీలించనున్నారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనాను నియంత్రించే అంశంపై సన్నద్ధత గురించి ప్రధానంగా చర్చించనున్నట్టు అధికారులు వెల్లడించారు. 

కరోనా విషయంలో యూపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. తాజ్‌ మహల్‌తో పాటు ఇతర ప్రసిద్ధ స్థలాల్లోకి వచ్చే వారికి కొవిడ్ పరీక్షను తప్పనిసరి చేసింది. కొత్త కేసులు వస్తే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారుల్ని ఆదేశించారు. మాస్కులు ధరించడం, ప్రికాషన్‌ డోసులు వేయించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని  సీఎం ఆదేశించారు. 

తమ ప్రభుత్వం 5 పాయింట్ల కార్యక్రమాన్ని అనుసరిస్తుందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి తానాజీ సావంత్‌ వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనేందుకు టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేట్‌తో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. 

దేశంలో శనివారం 236 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,424కి చేరింది. అలాగే, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,30,693కి చేరింది. మొత్తం ఇన్‌ఫెక్షన్లలో యాక్టివ్‌ కేసులు 0.01 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.80 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Thanks for reading CoronaVirus: Alert on Corona.. Preparedness in different states like this... (10 points)

No comments:

Post a Comment