CPS: సీపీఎస్‌పై చర్చ.. 20 ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థికశాఖ ఆహ్వానం
ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరపనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలకు, ప్రతినిధులకు ఆర్థిక శాఖ సమాచారం పంపించింది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సీపీఎస్‌పై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. అయితే, సీపీఎస్ అంశంపై చర్చించేందుకు మాత్రమే రావాలని ఆర్థిక శాఖ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసింది.
Thanks for reading CPS: Discussion on CPS.. AP finance department invites 20 unions
No comments:
Post a Comment