Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 20, 2022

Gold: bought tons of gold.. suddenly why..?


 Gold: కుప్పలు కుప్పలుగా బంగారం.. టన్నుల్లో గోల్డ్ కొనేశారు.. అకస్మాత్తుగా ఎందుకిలా..?

Gold: బంగారం సేఫ్ పెట్టుబడి అని అందరికీ తెలుసు. అది కష్టకాలంలో ఆదుకుంటుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సెంట్రల్ బ్యాంకులు దీనిపైనే దృష్టి పెట్టాయి.

గత కొన్నేళ్లుగా ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో వాటి నిల్వలు మళ్లీ 1990ల స్థాయి అయిన 37,000 టన్నులకు చేరుకున్నాయి. సెంట్రల్ బ్యాంకులు బాహాటంగా ఈ వివరాలను వెల్లడించనప్పటికీ అవి అందించే కొన్ని వివరాల ద్వారా కొంత డేటా తెలుస్తోంది.

షాకింగ్ కొనుగోళ్లు.. 

ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసిన మెుత్తం బంగారం అంకె విన్నవారికి కళ్లు తిరగక మానవు. 2022 మూడవ త్రైమాసికంలో అంటే కేవలం 3 నెలల కాలంలో సెంట్రల్ బ్యాంకులు దాదాపుగా 400 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 1970లలో బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ పతనమైనప్పటి నుండి కొన్ని కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని విక్రయించడం కొనసాగించాయి.

బంగారం విక్రయం.. 

అభివృద్ధి చెందిన దేశాల ఆస్తులలో బంగారం ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంక్ అత్యధికంగా బంగారాన్ని విక్రయిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో భారత్ 17 టన్నులు, టర్కీ 31 టన్నులు, ఉజ్బెకిస్థాన్ 26 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. రష్యా ఉక్రెయిన్ పై దండెత్తినప్పటి నుంచి తన బంగారం నిల్వల వివరాలను వెల్లడించటంలేదు.

పెరుగుతున్న కొనుగోళ్లు.. 

2010 నుంచి బంగారం కొనుగోళ్లు సగటున పెరుగుతుండగా.. వాటి నుంచి రాబడి సైతం పెరుగుతోంది. అయితే సెంట్రల్ బ్యాంకుల గత సంవత్సరం డేటా ప్రకాం ప్రస్తుతం ఎంత బంగారం కొన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవటం కష్టతరమని నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ చెబుతోంది. సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీని స్థిరీకరించుకునేందుకు బంగారం నిల్వలను కీలకంగా వినియోగిస్తాయని తెలుస్తోంది. 2015లో రష్యా ఏకంగా 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా.. చైనా 850 టన్నులు, ఇండియా 220 టన్నుల గోల్డ్ కొనుగోలుతో రికార్డు సృష్టించాయి.

టాప్ గోల్డ్ హోల్డర్స్.. 

ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కలిగి ఉన్న దేశాల వివరాలను గమనిస్తే.. మొదటి 3 స్థానాలను రష్యా, చైనా, భారత్ ఆక్రమించాయి. దీని తరువాతి స్థానాల్లో టర్కీ, కజకిస్తాన్, పోలాండ్, పాకిస్తాన్, థాయ్‌లాండ్, హంగేరి, జపాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ స్టేట్స్, అజర్‌బైజాన్, బ్రెజిల్, ఈజిప్ట్ ఉన్నాయి.

Thanks for reading Gold: bought tons of gold.. suddenly why..?

No comments:

Post a Comment