Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 2, 2022

LIC Good News: All the details on WhatsApp..here is the number!


 ఎల్‌ఐసీ గుడ్‌ న్యూస్‌: వాట్సాప్‌లోనే వివరాలన్నీ..నెంబరు ఇదిగో!

 దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది.

పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్‌ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్‌ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. 

వాట్సాప్‌ నంబర్ ద్వారా అనేక సేవలు

వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి '8976862090'నంబర్‌కు ' Hi 'అని మెసేజ్‌ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. 

►ప్రీమియం బకాయి

► బోనస్ సమాచారం

► పాలసీ స్థితి

►లోన్ అర్హత కొటేషన్

►లోన్ రీపేమెంట్ కొటేషన్

►చెల్లించవలసిన రుణ వడ్డీ

► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్

►ULIP-యూనిట్‌ల స్టేట్‌మెంట్

►LIC సర్వీస్ లింక్‌లు

►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం

రిజిస్టర్‌ ఇలా..

ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొంటేనే ఈ సేవలను వాట్సాప్‌లో పొందే వీలుంటుంది. ఒకవేళ మీ మొబైల్‌ నంబర్‌ను గానీ, మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను గానీ నమోదు చేసుకోకపోతే ఈ సేవలను పొందలేరు. ఒకవేళ మీరు రిజిస్టర్‌ చేసుకోకపోయి ఉంటే..

www.licindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అందులో కస్టమర్‌ పోర్టల్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి..

మీరు కొత్త యూజర్‌ అయితే New Userపై క్లిక్‌ చేసి పూర్తి వివరాలు నమోదు చేయండి.

ఒకవేళ మీరు పాత యూజర్‌ అయితే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వండి.

అందులో బేసిక్‌ సర్వీసెస్‌ విభాగంలో యాడ్‌ పాలసీని క్లిక్‌ చేసి ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీల వివరాలు అక్కడ నమోదు చేయొచ్చు.


Thanks for reading LIC Good News: All the details on WhatsApp..here is the number!

No comments:

Post a Comment