Oscars: ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ‘నాటునాటు’.. మరో మూడు భారతీయ చిత్రాలు
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన తొలి అడుగు పడింది. మార్చి నెలలో జరగనున్న ఈ అవార్డుల వేడుకలో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. ఈ జాబితాలో పేరు సొంతం చేసుకున్న చిత్రాలకు ఓటింగ్ పెట్టి వచ్చే నెలలో నామినేషన్స్‌ను ప్రకటించనున్నారు.
ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’లో (Oscars) సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు తొలి అడుగు వేశాయి. ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. సుమారు 10 విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (Last Film Show), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్నాయి. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించనున్నారు.
Thanks for reading oscars: 'Natunatu(RRR)'.and. three more Indian films in the Oscar shortlist
No comments:
Post a Comment