Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 25, 2022

UPSC – 395 Govt Jobs in NDA & NA Academy


UPSC – NDA & NA అకాడమీ లో 395 ప్రభుత్వ ఉద్యోగాలు

 యూపీఎస్సీ - నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ UPSC NDA NA Recruitment  యొక్క పూర్తి వివరాలు :

యూపీఎస్సీ - నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1) - 2023

ఖాళీలు: మొత్తం 395 ఖాళీలకు ప్రకటన వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ  పోస్టులు 370 (ఆర్మీ -208, నేవీ -42, ఏయిర్‌ఫోర్స్ - 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు.  నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.

అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ (లేదా) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్‌ఏ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.

దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి. 

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌ /ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, హైదరాబాద్, వరంగల్.

దరఖాస్తు రుసుం: జనరల్ కి రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 21, 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2023

ఆన్‌లైన్‌ రాత పరీక్ష: 16 ఏప్రిల్, 2023 న జరుగుతుంది.

కోర్సులు ప్రారంభం: 2 జనవరి, 2024

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Thanks for reading UPSC – 395 Govt Jobs in NDA & NA Academy

No comments:

Post a Comment