Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 20, 2022

Winter Effects: Blood sugar levels may increase in winter.. 5 best tips to keep it under control...


 Winter Effects: శీతాకాలంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ పెరిగే అవకాశం.. కంట్రోల్‌లో ఉంచుకునేందుకు 5 బెస్ట్‌ టిప్స్ ఇవే..

Winter Effects : శీతాకాలం వచ్చిందంటే దాదాపు మన దినచర్య మారిపోతుంది. ప్రతిరోజు చేసే పనులకు కేటాయించే సమయంలో కూడా వ్యత్యాసం వస్తుంది. వ్యాయామం, ఆహార అలవాట్లు అన్ని మారతాయి.

సాధారణ జీవన శైలికి పూర్తి భిన్నంగా శీతాకాలం(Winter) గడుస్తుంది. చల్లని వాతావరణం ప్రభావంతో బ్లడ్‌లో ఆక్సిజన్ స్థాయి తగ్గి రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. వీటితో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్‌ కూడా మారతాయి. శీతాకాల వాతావరణం శరీరంపై ఒత్తిడి పెంచుతుంది. ఒత్తిడి వల్ల శరీరం కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్‌లను విడుదల చేస్తుంది. ఇది లివర్ పనితీరుపై మార్పులు తీసుకువచ్చి, శక్తి కోసం అధికంగా గ్లూకోజ్ విడుదల చేస్తుంది. ఈ పరిస్థితుల్లో శరీర స్పందనలు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుదలకు దారి తీయవచ్చు. దీని నుంచి బయిట పడాలంటే కొన్ని టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది. వీటిద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గించుకోవడం

వ్యాయామంతో పాటు శరీరానికి అవసరం అయిన నిద్ర వల్ల, ఏకాగ్రతగా సాధన చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. శారీరక మార్పుల వల్ల మన మెదడు శరీరాన్ని కొన్ని విధమైన హార్మోన్లు విడుదల చేయడంలో నియంత్రిస్తుంది.

శరీరాన్ని వేడిగా ఉంచటం

వాతావరణం అతి చల్లగా ఉన్నప్పుడు షుగర్ పేషెంట్లకు శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం తప్పనిసరి. చేతులు చల్లగా ఉంటే సరైన బ్లడ్ షుగర్ రీడింగ్ అనేది రాదు. బ్లడ్ షుగర్ రీడింగ్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అనువుగా ఉండే వెచ్చని వాతావరణాన్ని చూసుకోవాలి.

క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం

శీతకాలంలో వాతావరణ మార్పుల వల్ల షుగర్‌ పేషెంట్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది కష్టతరమవుతుంది. ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకుని నిత్యం షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం. శీతాకాలంలో ఆకలి ఎక్కువగా వేయడం సహజమే. వేడిగా ఉంచడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. నిలువ చేసిన ఆహారాన్ని తీసుకునే బదులు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

ఆహారపు అలవాట్లు

మనం రోజూ తినే ఆహారానికి బదులు భోజనంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా షుగల్‌ లెవల్స్‌ను నియత్రించవచ్చు. శీతకాలంలో షుగర్ పేషెంట్లు టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ, వెజిటేబుల్ సూప్‌ను తీసుకుంటే మంచిది. ప్యాక్ చేసిన ఆహారాన్ని, వేపుడు పదార్థాలు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. దీని బదులు ఆకుకూరలు, కాయగూరలు ప్రత్యామ్నాయంగా పెట్టుకోవాలి.

చురుకుగా ఉండడం

శీతకాలంలో వ్యయమం చేయడం కోసం చలిని తట్టుకుని వెచ్చగా ఉండే గది నుంచి బయటికి రావడం ముఖ్యం. దీనివల్ల జీవక్రియ మెరుగుపడి ఆరోగ్యవంతంగా ఉంటారు. వ్యాయామం చేయడం చురుకుగా ఉండడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. యోగ చేయడం, మెట్లు ఎక్కి దిగడం వల్ల కూడా మార్పులు తీసుకురావచ్చు.

Thanks for reading Winter Effects: Blood sugar levels may increase in winter.. 5 best tips to keep it under control...

No comments:

Post a Comment