Bank Holidays February 2023: ఖాతాదారులకి అలర్ట్.. ఫిబ్రవరిలో బ్యాంకులకి సెలవులు ఎన్ని రోజులు వచ్చాయంటే..?
Bank Holidays February 2023: మరో పదిరోజుల్లో జనవరి నెల ముగిసి ఫిబ్రవరి ప్రారంభంకానుంది. ఈ నెలలో బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి.
సామాన్యుల జీవితంలో బ్యాంకు చాలా ముఖ్యమైన భాగం. నగదు లావాదేవీల నుంచి చెక్కులు, డ్రాఫ్ట్‌లు జమ చేయడం వరకు ప్రజలు బ్యాంకును సందర్శించాల్సి ఉంటుంది. సుదీర్ఘ సెలవుల కారణంగా ఖాతాదారులు చాలాసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది.
ప్రజల సౌకర్యార్థం భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. తద్వారా ఖాతాదారులు బ్యాంకు సంబంధిత పనులపై అప్రమత్తంగా ఉంటారు. ఆర్బీఐ కొత్త సంవత్సర క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2023లో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. అలాగే బ్యాంక్ హాలిడే వల్ల కలిగే సమస్యలను నివారించాలనుకుంటే ఇక్కడ రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను తనిఖీ చేయండి. తరువాత మీ పనిని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 5 - ఆదివారం
ఫిబ్రవరి 11 - రెండో శనివారం
ఫిబ్రవరి 12 - ఆదివారం
ఫిబ్రవరి 18 (మహాశివరాత్రి) - కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 19 -ఆదివారం (ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి)
ఫిబ్రవరి 20 సోమవారం - అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం (రాష్ట్ర దినోత్సవం)
ఫిబ్రవరి 21- మంగళవారం (లూసార్ -సిక్కింలో బంద్)
ఫిబ్రవరి 25 - నాలుగో శనివారం
ఫిబ్రవరి 26 - ఆదివారం
రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays February 2023
No comments:
Post a Comment