Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 4, 2023

Exams Calendar2023: 'Pariksha' period for students.. important competitive exam dates..!


 Exams Calendar2023: విద్యార్థులకు ‘పరీక్ష’ కాలం.. ముఖ్యమైన పోటీ పరీక్షల తేదీలివే..! 

విద్యార్థులకు ఇది పరీక్షా కాలమ్‌. వార్షిక పరీక్షలకు తోడు పోటీ పరీక్షలూ సమీస్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే కీలక పరీక్షల తేదీలివే.. 

ఇది పరీక్షల సీజన్‌(exams season). విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్ధమయ్యేందుకు అత్యంత కీలక సమయం. ఓవైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా.. మరోవైపు, ఉన్నత చదువులు/ పైతరగతులకు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షల తేదీలూ దగ్గరపడుతున్నాయి. దీంతో వీటిని సమతుల్యం చేసుకొనేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం(Preparation) కావడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే కొన్ని ముఖ్యమైన పోటీ పరీక్షల తేదీలను ఓసారి చూద్దాం..

జేఈఈ మెయిన్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2023) మొదటి విడత జనవరి 24 నుంచి 31 వరకు జరగనుంది. అనూహ్యంగా వచ్చే ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు కూడా నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)సన్నాహాలు చేసింది. 

జేఈఈ మెయిన్‌ రెండో విడత ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఏవైనా ఆటంకాలు ఎదురైతే ఏప్రిల్‌ 13, 15 తేదీలను కూడా అందుబాటులో ఉంచినట్టు ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్‌(JEE Main) పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతుంటారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) పరీక్షను జూన్‌ 4న నిర్వహించనున్నారు. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ గువాహటి(IIT Guwahati) నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

నీట్‌ యూజీ 2023: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ-2023 (NEET UG 2023) పరీక్ష మే 7న జరగనుంది. 

నీట్‌ (పీజీ) 2023: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్‌ పీజీ పరీక్ష(NEET PG exam 2023) మార్చి 5న జరగనుంది. దేశవ్యాప్తంగా 367 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) వెల్లడించింది.

క్యూట్‌ 2023: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్‌-2023 (CUET 2023) పరీక్ష మే 21 నుంచి 31 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా ఆటంకాలు ఎదురైతే జూన్‌ 1 నుంచి 7వరకు తేదీలను రిజర్వు చేసింది. 

యూజీసీ నెట్‌ 2022: జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడేందుకు అవకాశం కల్పించే  యూజీసీ - నెట్‌(UGC-NET) డిసెంబర్‌ 2022 పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు జరగనుంది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే  కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కోసం జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

గేట్‌2023: ప్రతిష్ఠాత్మక ఐఐటీలతోపాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో  పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే గేట్‌ 2023 పరీక్ష(GATE Exam2023) ఫిబ్రవరిలో జరగనుంది. గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)- 2023 పరీక్ష ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూర్‌ వెల్లడించింది. మార్చి 16న ఫలితాలు వెల్లడికానున్నాయి. 

నవోదయ పరీక్ష: దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ (JNV)ల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 29న జరగనుంది. ఈ పరీక్ష కోసం జనవరి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య పొందొచ్చు. 

సైనిక పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష:  రక్షణరంగంలో సేవలందించాలనే లక్ష్యంతో సైనిక పాఠశాలల్లో(Sainik Schools) ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేరాలనుకొనే వారికి నిర్వహించే ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష(aissee) జనవరి 8న జరగనుంది. దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా 18 స్కూళ్లు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయి. వీటికోసం నవంబర్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

Thanks for reading Exams Calendar2023: 'Pariksha' period for students.. important competitive exam dates..!

No comments:

Post a Comment