IBPS 2023 Exam Calendar: ఆగస్టు నుంచి బ్యాంకు పరీక్షలు
* ఐబీపీఎస్ క్యాలెండర్ 2023-24 విడుదల
* ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహణ తేదీల వెల్లడి
ప్రభుత్వ బ్యాంకు కొలువులకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) తీపికబురు అందించింది. 2023-2024 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్‌తో పాటు గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఖాళీల భర్తీకి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. ఆర్‌ఆర్‌బీ- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, 2, 3 ప్రిలిమ్స్, మెయిన్స్ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరుగనున్నాయి. పీఎస్‌బీ- క్లర్క్, పీవో ప్రిలిమ్స్, మెయిన్స్ ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు వివిధ తేదీల్లో నిర్వహించనున్నారు.
ప్రాథమిక, ప్రధాన పరీక్షలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రకటనలో తెలిపిన విధంగా అభ్యర్థులు ఫొటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర, డిక్లరేషన్ వివరాలను అప్‌లోడ్ చేయాలి. పరీక్ష తేదీలకు ముందే ఉద్యోగ ప్రకటన విడుదలవుతుంది కాబట్టి పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అనుసరిస్తూ ఉండాలని ఐబీపీఎస్ స్పష్టం చేసింది.
ఐబీపీఎస్ ఎగ్జామినేషన్-2023 క్యాలెండర్ వివరాలు...
1. ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XII(ఆఫీస్ అసిస్టెంట్), సీఆర్‌పీ ఆర్‌ఆర్‌ఆబీ-XII(ఆఫీసర్)
పరీక్ష పేరు తేదీలు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1) 2023 ఆగస్టు 05, 06, 12, 13, 19
సింగిల్ ఎగ్జామ్(ఆఫీసర్ స్కేల్-2 & 3) 2023 సెప్టెంబర్ 10
మెయిన్ ఎగ్జామ్(ఆఫీసర్ స్కేల్-1) 2023 సెప్టెంబర్ 10
మెయిన్ ఎగ్జామ్(ఆఫీస్ అసిస్టెంట్) 2023 సెప్టెంబర్ 16
2. పీఎస్‌బీ- సీఆర్‌పీ క్లర్క్-XIII, సీఆర్‌పీ పీవో/ ఎంటీ-XIII & సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII
పరీక్ష పేరు తేదీలు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(క్లర్క్) 2023 ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2
మెయిన్ ఎగ్జామినేషన్(క్లర్క్) 2023 అక్టోబర్ 07
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ప్రొబేషనరీ ఆఫీసర్) 2023 సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 01
మెయిన్ ఎగ్జామినేషన్ (ప్రొబేషనరీ ఆఫీసర్) 2023 నవంబర్ 05
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(స్పెషలిస్ట్ ఆఫీసర్) 2023 డిసెంబర్ 30, 31
మెయిన్ ఎగ్జామినేషన్(స్పెషలిస్ట్ ఆఫీసర్) 2024 జనవరి 28
Thanks for reading IBPS 2023 Exam Calendar
No comments:
Post a Comment