Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 24, 2023

JEE MAIN 2023 :Expert Analysis on Day 1 Exam


 మొదటిరోజు మొదటి పరీక్షలో 290కి పైగా స్కోరు

‣ సెషన్ -1లో తొలి పరీక్షపై నిపుణుల విశ్లేషణ

‣ మంచి పర్సంటైల్  సాధనలో కీలకం కానున్న గణితం, రసాయనశాస్త్ర0

జేఈఈ మెయిన్ – 2023 సెషన్-1 పరీక్షలు  మంగళవారం (24, జనవరి, 2023) ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి పరీక్షపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. టాపర్లు 290కి పైగా, యావరేజి అభ్యర్థులు 150కి పైగా, బిలో యావరేజి విద్యార్థులు 60కి పైగా మార్కులు పొందే అవకాశం ఉందని హైదరాబాద్ శ్రీచైతన్య విద్యాసంస్థల ఆల్ ఇండియా ఐఐటీ కో-ఆర్డినేటర్ ఎం. ఉమాశంకర్ విశ్లేషిస్తున్నారు. పరీక్ష స్థాయికి తగిన ప్రమాణాలతో ప్రశ్నపత్రం ఉందని ఆయన పేర్కొన్నారు.  అభ్యర్థులు జాతీయస్థాయిలో మంచి పర్సంటైల్ సాధించడంలో గణితం, రసాయనశాస్త్రం కీలకం కానున్నాయని చెబుతున్నారు. 

సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సరళి

‣ గణితంలో ప్రశ్నలు పెద్దవిగా ఉన్నాయి. ఈ విభాగాన్ని పూర్తి చేయడనికి కనీసం 80 నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది. 12-13 ప్రశ్నలు సాధారణంగా ఉన్నాయి. 6 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. బేసిక్స్ నుంచి ప్రశ్నలు తక్కువ వచ్చాయి. ఎక్కువ ప్రశ్నలకు సుదీర్ఘ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చింది. 3డీ, వెక్టార్ ఆల్జీబ్రా, మ్యాథమెటికల్ రీజనింగ్ ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి. 

‣ ఫిజిక్స్ ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. ఫార్ములా ఆధారితంగా ఉన్నాయి.ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. అందరు విద్యార్థులు 12 ప్రశ్నలు చేయగలుగుతారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నెటిజమ్, మోడ్రన్ ఫిజక్స్, ఈఎంఐ, ఫ్రిక్షన్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఏసీ కరెంట్ అధ్యాయాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఎన్ సీఈఆర్ టీ సిలబస్ నుంచి 3-4 ప్రశ్నలు ఇచ్చారు. 

‣ కెమిస్ట్రీ మొత్తం మీద తేలిగ్గా ఉంది. ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగాలకు వెయిటేజీ సమానంగా ఉంది. వాటి నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి తక్కువ ప్రశ్నలు ఇచ్చారు. ఎన్ సీఈఆర్ టీ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. వాటిలో ఎక్కువ థియరీ ఆధారితంగా ఉన్నాయి. 12 ప్రశ్నల వరకు అందరూ చేయగలుగుతారు.  ఇంకా కెమికల్ కైనెటిక్స్, ఈక్విలిబ్రిమ్, పీరియాడిక్ టేబుల్, గ్రాఫ్ ఆధారితంగా ప్రశ్నలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేశాయి. 

JEE MAIN - 2023 - SESSION-1

* 24/01/23 - Slot-1

Almost it’s like JEE MAIN 2022. They are maintain good standards in Mathematics for reducing more number of 300/300 marks.

Students those preparing for advanced exams can score well.

Mathematics and chemistry play god role for percentiles and ALL INDIA RANKS

MATHEMATICS:

‣ Too Lengthy 

‣ Need 80-90 minutes to complete 

‣ 12- 13 Comfortable Questions 

‣ All students can do 6 questions easily 

‣ Mathematics few are basic concept questions only came but many problems involved lengthy calculations 

‣ Questions in 3D, VECTOR ALGEBRA, MATHAMATICAL REOSONING QUESTIONS ARE EASY 

PHYSICS

‣ Moderate

‣ More Formulae Based

‣ 12th Syllabus More Questions

‣ All students can do easily 12 Questions 

‣ In physics more questions came from Semiconductors, electrostatics, magnetism, modern physics, EMI, friction nuclear physics, AC CURRENT. 

‣ In physics also 3 to 4 theory questions came based on NCERT

CHEMISTRY

‣ Easy

‣ Organic & Inorganic Almost equal No of Questions, Physical less 

‣ Maximum form NCERT Standard Only

‣ Easily can do 12 Q's.

‣ In Chemistry many are theory questions based on NCERT BOOKS

‣ More questions are from organic and inorganic,

‣ Questions given from Chemical kinetics, equilibrium, graph based questions. Periodic table, chemical bonding 

‣ Physical chemistry chapter problems are given but they are easy. 

‣ Only few chemistry questions are confusing


Final Verdict:

‣ Toppers can score 290 plus

‣ Medium students can score 150 plus

‣ Slow learns  can score 60 plus marks

Thanks for reading JEE MAIN 2023 :Expert Analysis on Day 1 Exam

No comments:

Post a Comment