Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 2, 2023

Jobs in Mahanadi Coalfields Limited |MCL Recruitment 2023: Apply for 295 various posts at mahanadicoal.in



Jobs in Mahanadi Coalfields Limited |MCL Recruitment 2023: Apply for 295 various posts at mahanadicoal.in




 

కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ... మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ నుంచి ఉద్యోగ నియామక ప్రకటన వెలువడింది. ఒడిశా రాష్ట్రంలోని బుర్లా, జాగృతీ విహార్‌లో ఉన్న ఈ సంస్థ  295 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం 295 ఖాళీల్లో జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌-82 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 43, ఈడబ్ల్యూఎస్‌కు 8, ఎస్సీకి 14, ఎస్టీకి 7, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)కి 10 కేటాయించారు. మైనింగ్‌ సర్దార్‌ 145 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 74, ఈడబ్ల్యూఎస్‌కు 14, ఎస్సీకి 13, ఎస్టీకి 35, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కి 9 కేటాయించారు. సర్వేయర్‌ 68 ఖాళీల్లో అన్‌రిజర్వుడ్‌కు 27, ఈడబ్ల్యూఎస్‌కు 06, ఎస్సీకి 12, ఎస్టీకి 14, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కి 9 కేటాయించారు.

దరఖాస్తుదారుల వయసు 23.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు.  

ఏ అర్హతలుండాలి?

1. జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌ పోస్టుకు మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఓపెన్‌ కాస్ట్‌ (ఓసీ), అండర్‌ గ్రౌండ్‌ (యూజీ) మైన్స్‌లో పనిచేసినట్టుగా ఓవర్‌మ్యాన్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

2. మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు 10+2/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. లేదా మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఓసీ అండ్‌ యూజీ మైన్స్‌లో పనిచేసినట్టుగా మైనింగ్‌ సర్దార్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

3. సర్వేయర్‌ పోస్టుకు 10+2/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. లేదా  మైనింగ్‌/మైన్‌ సర్వేయింగ్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఓసీ, యూజీ మైన్స్‌లో పనిచేసినట్టుగా సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.

ఎంపిక ఇలా..

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉండదు. నోటిఫికేషన్‌లో తెలిపిన అర్హతలున్న అభ్యర్థులను సీబీటీకి ఎంపికచేస్తారు. సీబీటీలో పాసైన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. నెగెటివ్‌ మార్కులు ఉండవు. పరీక్ష ఇంగ్లిష్‌/హిందీ భాషల్లో ఉంటుంది. దీంట్లో ఎ, బి అనే రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎలో జనరల్‌ అవేర్‌నెస్‌/ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు 20 ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సెక్షన్‌-బిలో టెక్నికల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 80 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

* సీబీటీ షెడ్యూల్‌ నిర్ణీత సమయంలో ఎంసీఎల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు వ్యక్తిగతంగా సాధించిన మార్కులనూ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

కనీసార్హత మార్కులు: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 45 శాతం, ఓబీఎస్‌ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి.

ముఖ్యాంశాలు: సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆయా అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలి. ప్రభుత్వ, అనుబంధ సంస్థలు, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నవారు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి. ఒరిజినల్‌ డాక్యుమెంట్లు/ సర్టిఫికెట్ల పర్యవేక్షణ తేదీ, వేదికను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. దాని ప్రకారం అభ్యర్థులు హాజరుకావాలి.

* ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరీక్షించిన తర్వాత దాంట్లో ఎంపికైన అభ్యర్థుల ‘ప్రొవిజనల్‌ సెలెక్ట్‌ లిస్ట్‌’ను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ప్రొవిజనల్‌ లిస్టులోని అభ్యర్థులకు ఆఫర్‌ లెటర్లను జారీచేస్తారు.

* ఎంపికలో భాగంగా ప్రతి దశలోని సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు. కాబట్టి అభ్యర్థులు తరచూ సైట్‌ను చూస్తుండాలి.

* దరఖాస్తులో పేర్కొన పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థులు మూడింటిని ఎంచుకోవాలి. ఒకసారి దరఖాస్తును సమర్పించిన తర్వాత ఎలాంటి మార్పులూ, చేర్పులకు అవకాశం ఉండదు.

* దరఖాస్తు ప్రింట్‌ అవుట్‌ తీసుకుని రికార్డు కోసం పదిలపరుచుకోవాలి. దీన్ని పోస్టులో పంపనవసరం లేదు.

* దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాల కేటాయింపు ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులను మహానది కోల్‌ఫీల్డ్స్‌/ కోల్‌ ఇండియా లిమిటెడ్‌లోని ఏ ఖనులు లేదా ప్రాజక్టుల్లోనైనా నియమించొచ్చు. కోల్‌ ఇండియా అనుబంధ సంస్థలకూ బదిలీ చేయొచ్చు. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండే అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 03.01.2023

దరఖాస్తులకు చివరి తేదీ: 23.01.2023

వెబ్‌సైట్‌: https://www.mahanadicoal.in/

Thanks for reading Jobs in Mahanadi Coalfields Limited |MCL Recruitment 2023: Apply for 295 various posts at mahanadicoal.in

No comments:

Post a Comment