RRR: ‘నాటునాటు’కు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు.. తారక్, చరణ్ కేరింతలు
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మరో విశిష్ఠ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును సొంతం చేసుకుంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మరో విశిష్ఠ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్’ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది. ఈ మేరకు బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, రాజమౌళి, చరణ్.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నా శ్రమను, మద్దతిచ్చినవారిని నమ్ముకున్నా: కీరవాణి
అవార్డు తీసుకున్న అనంతరం కీరవాణి (Keeravani) మాట్లాడుతూ.. ‘‘గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్ ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు’’ అని తెలిపారు.
ఎన్టీఆర్-రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులను ఉద్దేశిస్తూ కల్పిత కథగా ఇది రూపుదిద్దుకుంది. యాక్షన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి నెలలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అంతటా మంచి రెస్పాన్స్ లభించింది. విదేశీయులను సైతం ఈ పాట ఉర్రూతలూగించింది. చంద్రబోస్ ఈపాటను రచించగా.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.
PM Modi: ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ప్రధాని మోదీ ప్రశంస
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) టీమ్‌పై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు గర్వపడేలా చేశారని అన్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రబృందంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డును ఈ చిత్రం సొంతం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ తాజాగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ఇదొక విశేషమైన విజయం!! కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్‌తోపాటు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర చిత్రబృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
2023 Golden Globe Awards Winners List: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కంప్లీట్ విన్నర్స్ లిస్ట్...!
ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంటుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా... చిరంజీవి, ఏ ఆర్ రెహమాన్ తో పాటు పలువురు ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అవార్డు అందుకున్న కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నాటు నాటు సాంగ్ ని అవార్డుకి ఎంపిక చేసిన గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ కి కృతఙ్ఞతలు తెలిపిన కీరవాణి... ఈ ఆనందాన్ని తన భార్య శ్రీవల్లితో పంచుకుంటున్నట్లు తెలిపారు. తనకు దక్కిన ఈ గౌరవానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ కారణం అన్నారు.
ఇక గోల్డెన్ గ్లోబ్ 2023 సినిమా విభాగంలో అవార్డ్స్ అనుకున్న చిత్రాల జాబితా పరిశీలిస్తే...
బెస్ట్ మోషన్ పిక్చర్ - డ్రామా
విన్నర్: ది ఫాబెల్మాన్స్
బెస్ట్ మోషన్ పిక్చర్ - మ్యూజిక్ OR కామెడీ
విన్నర్ : ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
బెస్ట్ మోషన్ పిక్చర్ - నాన్ ఇంగ్లీష్
విన్నర్: అర్జెంటీనా, 1985
బెస్ట్ మోషన్ పిక్చర్ - యానిమేటెడ్
విన్నర్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
బెస్ట్ డైరెక్టర్ - మోషన్ పిక్చర్
విన్నర్: స్టీవెన్ స్పీల్బర్గ్, ది ఫాబెల్మాన్స్
బెస్ట్ స్క్రీన్‌ప్లే - మోషన్ పిక్చర్
విన్నర్ : మార్టిన్ మెక్‌డొనాగ్, ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
బెస్ట్ యాక్టర్ - డ్రామా
విన్నర్: ఆస్టిన్ బట్లర్, ఎల్విస్
బెస్ట్ యాక్ట్రెస్ -డ్రామా
విన్నర్: కేట్ బ్లాంచెట్, టార్
బెస్ట్ యాక్టర్ -మ్యూజిక్ OR కామెడీ
విన్నర్: కోలిన్ ఫారెల్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
బెస్ట్ యాక్ట్రెస్ -మ్యూజిక్ OR కామెడీ
విన్నర్: మిచెల్ యో, ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ యట్ ఒన్స్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్:
విన్నర్: కే హుయ్ క్వాన్, ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ యట్ ఒన్స్
ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్:
విన్నర్: ఏంజెలా బాసెట్, బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ -మోషన్ పిక్చర్
విన్నర్: జస్టిన్ హర్విట్జ్, బాబిలోన్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్
విన్నర్: కీరవాణి, ఆర్ ఆర్ ఆర్ మూవీ
Thanks for reading RRR: Golden Globe Award for 'Natunatu'
No comments:
Post a Comment