TCS Off Campus 2023 Drive For 2023, 2022, 2021 Batch Freshers, Online Registrations (Open)
TCS: టీసీఎస్ స్మార్ట్ హైరింగ్-2023
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2023 ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన అభ్యర్థులు టీసీఎస్ ఇగ్నైట్‌లోని సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చేరే అవకాశాన్ని పొందుతారు.
వివరాలు...
* టీసీఎస్ స్మార్ట్ హైరింగ్-2023
అర్హత: బీసీఏ/ బీఎస్సీ (గణితం, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ)/ బీవొకేషనల్(సీఎస్/ ఐటీ) ఉత్తీర్ణత.
* అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
బ్యాక్‌లాగ్: ఉత్తీర్ణత సాధించిన 2023 సంవత్సరం నుంచి అభ్యర్థులకు ఒక బ్యాక్‌లాగ్ మాత్రమే అనుమతిస్తారు. అయితే పెండింగ్‌లోని అన్ని బ్యాక్‌లాగ్‌లను నిర్ణీత కోర్సు వ్యవధిలో పూర్తి చేయాలి.
విద్యలో గ్యాప్/బ్రేక్: అకడమిక్ విద్యలో ఖాళీలు ఏవైనా ఉంటే అభ్యర్థులు వాటిని దరఖాస్తు సమయంలో పేర్కొనాలి. మొత్తం అకడమిక్ గ్యాప్ 2 సంవత్సరాలకు మించకూడదు. దానికి సంబంధించిన ధ్రువపత్రాలు ఉండాలి.
వయసు: కనీసం 18-28 సంవత్సరాలు ఉండాలి.
* ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అభ్యర్థులకు ట్రెండింగ్ టెక్నాలజీలపై శిక్షణ ఇస్తారు.
పని ప్రదేశం: దేశవ్యాప్తంగా పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* పరీక్షను టీసీఎస్ ఐయాన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష సమయం 50 నిమిషాలు. వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 31.01.2023
పరీక్ష తేదీ: 10.02.2023.
Thanks for reading TCS Off Campus 2023 Drive For 2023, 2022, 2021 Batch Freshers, Online Registrations (Open)
No comments:
Post a Comment