Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 2, 2023

CM Review on Education Department @02.02.23


విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు


అమరావతి: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సబ్జెక్టుల వారీ టీచర్లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌బీ, టీవీ స్క్రీన్లు, వీటిలో ఉంచాల్సిన పాఠ్యాంశాలు, బైజూస్‌ ట్యాబుల వినియోగం, స్వచ్ఛ, విద్యార్థులకు రాగి జావ, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు.

‘‘విద్యారంగంలో మనం అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం. దీనివల్ల విద్యా కానుక దగ్గరనుంచి పాఠ్యాంశాల వరకూ, అదే విధంగా మౌలిక సదుపాయాలు దగ్గర నుంచి గోరుముద్ద వరకూ కూడా నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా కూడా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం. పాఠ్యపుస్తకాల్లో పేపర్‌ క్వాలిటీ బాగుండాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:

►6వ తరగతి ఆపైన ఉన్న ప్రతి తరగతిగదిలోనూ ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం

►దీనివల్ల బోధన, నేర్చుకోవడం సులభతరమవుతుంది

►6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం

►తర్వాత 8 వ తరగతి నుంచి ట్యాబ్‌లను ఇస్తున్నాం

►దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్‌ ఎలిమెంట్స్‌ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం

►ఇలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా డిజిటిల్‌ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలి

►ఇది ఏ రూపంలో ఉండాలన్న దానిపై అధికారులు ఆలోచించి ప్రతిపాదనలు ఇవ్వాలి

►దీనివల్ల శాశ్వతంగా పిల్లలకు ఉత్తమ బోధన అందించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు అవుతుంది

►సీఎం ఆదేశాలతో సబ్జెక్ట్‌ టీచర్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు

►ఈ మార్పులు కారణంగా చక్కటి అర్హతలున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చారన్న అధికారులు

►గతంలో 3,4,5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదని, సబ్జెక్టు టీచర్స్‌ కాన్సెప్ట్‌లో భాగంగా సబ్జెక్టుల వారీ టీచర్లతో మంచి బోధన అందుతుందన్న అధికారులు

►విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్‌ అంశంగా తీసుకుని మరింత దృష్టి పెట్టాలన్న సీఎం

►ఐఎఎఫ్‌పి ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో వారి బోధనపై సీరియస్‌గా ఉండాలి

►సీరియస్‌గా బోధన లేకపోతే ఫలితం ఉండదు

►మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది

►ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ కొనుగోలు టెండర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వెళ్లందని తెలిపిన అధికారులు

►వీటిని నిర్దేశించుకున్న సమయంలోగా నాడు – నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లకు అందించాలన్న సీఎం

►వచ్చే విద్యాసంవత్సరంలోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు అందించాలన్న సీఎం

►నాడు – నేడు పూర్తవుతున్న కొద్దీ ఆ స్కూళ్లలో ఐఎఫ్‌పీలు ఏర్పాటు ఉండాలన్న సీఎం

►8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లు ప్రారంభంలోగా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం

►పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్‌.... ఇవన్నీ కూడా పూర్తి సినర్జీతో ఉండాలన్న సీఎం

►ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిషులో పట్టుపెంచుకునేందుకు వారికి చేదోడుగా నిలవాలన్న సీఎం

►ఈ క్రమంగా ఇంగ్లిషు మాట్లాడ్డం, రాయడంలో వారు మెరుగైన ప్రావీణ్యం సాధించాలన్న సీఎం

►టోఫెల్, మరియు కేంబ్రిడ్జి లాంటి సంస్థల భాగస్వామ్యాన్నికూడా తీసుకోవాలన్న సీఎం

►వీరి సహాయంతో 3వ తరగతి నుంచీ పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫకెట్లు జారీచేసేలా కార్యక్రమాలను రూపొందించాలని సీఎం ఆదేశం

►టీచర్లకూ ఇంగ్లిషుపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలన్న సీఎం

►విద్యార్థులు ట్యాబులను వినియోగిస్తున్న తీరును సీఎంకు వివరించిన అధికారులు

►ట్యాబుల వినియోగంలో వైఎస్సార్‌ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థుల మొదటి మూడు స్థానాల్లో ఉన్నారన్న అధికారులు

►ట్యాబుల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్‌బ్యాక్‌ అందించాలన్న సీఎం.

►సీఎం ఆదేశాల మేరకు గోరుముద్దలో భాగంగా రాగిమాల్ట్‌ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు

జగనన్న విద్యాకానుకపైనా సీఎం సమీక్ష

►మార్చిలో మొదలుపెట్టి ఏప్రిల్‌ చివరినాటికి విద్యాకానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామన్న అధికారులు

►సీఎం ఆదేశాలమేరకు స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక కిట్‌ అందిస్తామన్న అధికారులు

►మొదటి దశ నాడు–నేడుపై ఆడిట్‌పై  సీఎం ఆరా. ఆడిట్‌ పూర్తయ్యిందన్న అధికారులు

►మౌలికసదుపాయాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దాలన్న సీఎం

​​​​​​​►ఐఎఫ్‌పీ, టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్న సీఎం

​​​​​​​►అప్పుడే పూర్తిస్థాయిలో నాడు – నేడు పూర్తవుతుందన్న సీఎం

​​​​​​​►మొత్తంగా 11 రకాల సదుపాయాలను నాడు – నేడు కింద కల్పిస్తున్నామన్న అధికారులు

రెండోదశ నాడు–నేడుపైన సీఎం సమీక్ష.

​​​​​​​►మొదటి దశలో 15,715 స్కూళ్లను బాగుచేసిన ప్రభుత్వం

​​​​​​​►రెండో దశలో 23,221 స్కూళ్లను బాగుచేస్తున్న ప్రభుత్వం

​​​​​​​►మూడోదశలో 16,968 స్కూళ్లను బాగుచేయనున్న ప్రభుత్వం

​​​​​​​►వీటితోపాటు అంగన్‌వాడీలు, హాస్టళ్లనుకూడా బాగుచేస్తున్న ప్రభుత్వం

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం.వి శేషగిరిబాబు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్‌.దీవాన్‌ రెడ్డి, నాడు–నేడు టెక్నికల్‌ డైరెక్టర్‌ మనోహరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Thanks for reading CM Review on Education Department @02.02.23

No comments:

Post a Comment