మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు
‣ 119 ఖాళీలతో ప్రకటన
దేశంలోనే ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్ (సీఎంఈ) వివిధ పోస్టుల నియామకానికి తాజాగా ప్రకటన విడుదల చేసింది. స్క్రీనింగ్, రాతపరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల జాబితాను రూపొందించి రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేయగలగాలి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్ (సీఎంఈ)ను 1943లో పుణెలో ప్రారంభించారు. భారత సైన్యానికి చెందిన ఇంజినీర్లకు అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక శిక్షణ ఇక్కడ లభిస్తుంది. మిలిటరీకి సంబంధించిన పరిశోధనా ప్రాజెక్టులు, ప్రయోగాల విషయంలోనూ సీఎంఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి విపత్తుల సమయంలో చేపట్టే సహాయక చర్యల విషయంలోనూ శిక్షణను అందిస్తుంది. భారత మిలిటరీ చెందినవారితోపాటు మిత్ర దేశాలకు చెందిన అధికారులకు అవసరమైన శిక్షణా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
ఖాళీలు: అకౌంటెంట్ - 1, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 1, సీనియర్ మెకానిక్ - 2, మెషీన్ మైండర్ లిథో (ఆఫ్‌సెట్) - 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 3, లోయర్ డివిజన్ క్లర్క్ - 14, స్టోర్‌కీపర్ - 2, సివిలియన్ మోటార్ డ్రైవర్ (సీఎండీ) - 3, లైబ్రరీ క్లర్క్ - 2, శాండ్ మోడెలర్ - 4, కుక్ - 3, ఫిల్టర్ జనరల్ మెకానిక్ (స్కిల్డ్) - 6, మౌల్డర్ - 1, కార్పొంటర్ (స్కిల్డ్) - 5, ఎలక్ట్రీషియన్ (స్కిల్డ్) - 2, మెషినిస్ట్ ఉడ్ వర్కింగ్ - 1, బ్లాక్‌స్మిత్ (స్కిల్డ్) - 1, పెయింటర్ (స్కిల్డ్) - 1, ఇంజిన్ ఆర్టిఫిషర్ - 1, స్టోర్‌మేన్ టెక్నికల్ - 1, ల్యాబొరేటర్ అటెండెంట్ - 2, మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 49, లస్కర్ - 13 పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీల్లో అన్‌రిజర్వుడ్‌కు 48, ఈడబ్ల్యూఎస్‌కు 11, ఓబీసీకి 26, ఎస్సీకి 27, ఎస్టీకి 7 కేటాయించారు. ఇవికాకుండా ఈఎస్‌ఎం అభ్యర్థులకు 12, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 4 పోస్టులను రిజర్వు చేశారు.
ఏయే అర్హతలు ఉండాలి?
1. ఎల్‌డీసీ పోస్టుకు ఇంటర్మీడియట్/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.
2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుకు మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష లేదా ఐటీఐ పాసవ్వాలి. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు సఫాయివాలా/ వాచ్‌మేన్/ గార్డెనర్/ మెసెంజర్‌గా విధులను నిర్వర్తించాలి. నియామక సభ్యులు సూచించిన విధంగా విధులను ఎంపిక చేసుకోవాలి.
3. లస్కర్ పోస్టుకు మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు లోడింగ్, అన్‌లోడింగ్, డిగ్గింగ్ లాంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేయాలి.
వయసు: అభ్యర్థుల వయసు 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. సివిలియన్ మోటార్ డ్రైవర్ (సీఎండీ) పోస్టుకు మాత్రం గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. ప్రత్యేక వర్గాలవారికి రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.
‣ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
‣ ఎలాంటి సమాచారం అందుకోని అభ్యర్థులు దరఖాస్తు పంపిన నెల రోజుల తర్వాత షార్డ్‌లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి. ఉన్నట్లయితే అడ్మిట్‌కార్డ్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
‣ ప్రకటనలో పేర్కొన్న వాటి కంటే కొందరికి అదనపు విద్యార్హతలూ, అనుభవం ఉన్నా వాటిని పరిగణనలోకి తీసుకోరు.
‣ రాత పరీక్ష సిలబస్, మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
‣ పుణెలో రాత పరీక్షను నిర్వహిస్తారు.
‣ ఎల్డీసీ, సీఎండీ, కుక్ పోస్టులకు స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్ తప్పనిసరి.
‣ అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినప్పటికీ, విద్యార్హతలు, ప్రాధాన్యాలను బట్టి ఒక్క పోస్టుకు మాత్రమే అడ్మిట్ కార్డ్‌ను జారీచేస్తారు.
రాత పరీక్ష
విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉండి.. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలుంటాయి. అవి:
1) జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
2) న్యూమరికల్ ఆప్టిట్యూడ్
3) జనరల్ ఇంగ్లిష్
4) జనరల్ అవేర్‌నెస్.
‣ జనరల్ ఇంగ్లిష్ పేపర్ తప్ప.. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటాయి.
‣ రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 04.03.2023
వెబ్‌సైట్: https://cmepune.edu.in
‣ ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింటవుట్‌ను పోస్టులో పంపనవసరం లేదు.
‣ గరిష్ఠంగా మూడు పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అయితే పోస్టుల ప్రాధాన్య క్రమాన్ని దరఖాస్తులో తెలియజేయాలి. అభ్యర్థి అర్హతలు, అనుభవం సరిపోయే పోస్టుకు అడ్మిట్‌కార్డ్ పంపిస్తారు.
Thanks for reading CME Pune Recruitment 2023 – Apply Online For Latest jobs
No comments:
Post a Comment