Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 27, 2023

From The Desk of Principal Secretary School Education Programme YouTube Live


 From The Desk of Principal Secretary School Education Programme YouTube Live

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●◆◆◆◆◆◆◆

★★★★★★★★★★★★★★★★★★★★★★

Hon'ble Principal Secretary 10th Episode ముఖ్యాంశాలు  :

1. ప్రతి శనివారం Schools Visit చేయడం వల్ల Field లో జరిగే Reality check down చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

2. Education Department  వున్నా gaps ఎలా పూర్తి చేయాలి అనే విషయం మీద ఆలోచించడం.

3. ఒక Academic year లో middle of the months September, October, November and December చాలా కీలకమైనవి. ఎందుకంటే Syllabus Complete చేయడానికి ఇదే మంచి సమయం.

4. Viziahnagaram District పర్యటనలో KGBV School లో Social Teacher Notes Corrections చాలా బాగా చేశారు.

5. ఈ ప్రపంచంలో  Communication Skills ఉంటేనే భవిష్యత్తులో ఏదీ అయినా చేయగలం. English is only the Centre Point for Communication Skills.

6. October మొదటి వారం నుంచి FA - 2 పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం విద్యార్థులను సిద్ధం చేయాలి. Syllabus పూర్తి చేయడం, Note Books Corrections చేయడం పూర్తి చేయాలి.

7. ప్రభుత్వం ఉద్యోగస్తులు వేరు కాదు. I am the Government అనే భావన , సంకల్పం కలిగి ఉండాలి. మనల్ని మనం ప్రశ్నించు కోవాలి. Self Evaluation ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను ఎక్కడ fail అవుతూ వున్నాను,నా యొక్క Improvement ఇంకా ఎలా వుండాలి ?

8. DSC రాసినప్పుడు ఎలా అయితే కష్టపడ్డారు అదే విధంగా ప్రతి రోజూ ప్రిపరేషన్ వుండాలి. Government jobs లోకి వచ్చాక ఇవన్నీ మనకు ఎవరు చెప్పరు.

9. సత్యం ధర్మం ప్రకారం పని చేయాలి. ప్రతి రోజు Notes తయారు చేసుకోవడం, Analysis చేయడం ,Field  Observation చేయడం.

10. ఇప్పటి వరకూ ఒక MEO గానీ ఒక DYEO గానీ ఒక్క Inspection కూడా చేయలేదు. ఒక MEO నెలకు ఎన్ని Visits చేయాలి? ఎన్ని Inspections చేయాలి? నా Request ఏమంటే కనీసం నెలకు ఆరు Inspections అయినా చేయండి.

11. మీ యొక్క Inspection Reports మీ DEO గారు కి and మీ RJD గారికి పంపండి.

12. Corrections చేయడం లో కూడా Quality Maintain  చేయాలి.  సత్యం ధర్మం ప్రకారం పని చేయాలి.

13. మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోవాలి.స్టూడెంట్స్ ఎప్పుడు మంచివారే. మంచి తరగతి వాతావరణం మీరే తయారు చేసుకోవాలి.

                ************

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 25/07/23 ఎనిమిదో వీడియోలోని సందేశం

*ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ 8 వ ఎపిసోడ్ ముఖ్య విషయాలు

🔹 *నేను పాఠశాలలకు విజిటింగ్ కు వచ్చేటప్పుడు ఇకనుండి నా సొంత నిర్ణయంతో రాను!

*రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పట్టిక రూపంలో కంప్యూటర్లో ఉంచి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి, ఏ పాఠశాల పేరు display అయితే ఆ పాఠశాలలకు విజిటింగ్ కు రావడం జరుగుతుంది.

🔹 *పాఠశాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బెస్ట్ యూజ్ చేయాలి.వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథాగా వాడకుండా ఉంచరాదు.

🔹 *విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యా నాణ్యత విషయంలో కాంప్రొమైజ్ కారాదు. నా సందర్శనలలో ఫోకస్ ఐటెం ఇదే.*

🔹 *FA 1 పరీక్షలను విద్యార్దులు ఇంగ్లీష్ మీడియం లో రాసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.FA 1 పరీక్షల్లో TOEFL పార్ట్ విషయం లో కూడా విద్యార్థులను సంసిద్ధులను చేయాలి.

 *-ఎపిసోడ్ 8 వీడియో ద్వారా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి.





★★★★★★★★★★★★★★★★★★★

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 23/06/23 ఏడవ వీడియోలోని సందేశం

7th Video Direct YouTube Live Link : https://youtu.be/7esRZntp4Wk




★★★★★★★★★★★★★★★★★★★★★★★

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 25/05/23 ఆరవ వీడియోలోని సందేశం

6th Video Direct  YouTube Live Link : 

https://youtu.be/VmzzJTstBTg




★★★★★★★★★★★★★★★★★★★★★★★

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 26/04/23 ఐదవ వీడియోలోని సందేశం

5th Video Direct  YouTube Live Link : 

https://youtu.be/AJC8mNRPLFI




★★★★★★★★★★★★★★★★★★★★★

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 23/03/23 నాల్గవ వీడియోలోని సందేశం

4th Video YouTube Live Link : 

https://youtu.be/zma-D_aZ3Ss

ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ 4వ ఎపిసోడ్ ముఖ్యాంశాలు ...

✍️ *కార్యక్రమాల అమలులో అసౌకర్యాలు కలిగితే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి  :: గౌ౹౹ ప్రవీణ్ ప్రకాష్ గారు ...

గత నాలుగు నెలలుగా పాఠశాల ల సందర్శన లో  అంశాలను మీతో పంచుకోవడం లో భాగంగా...ఈ రోజు ..మీతో.

* పాయింట్ నెంబర్ వన్.... కవరేజ్ ఆఫ్ సిలబస్....

 మీ పిల్లవాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్న ఆ పాఠశాలలో పాఠ్యాంశాలు పూర్తి కాకుండా మీ పిల్లవాడు పరీక్ష రాస్తూ ఉంటే మీరు ఎలా భావిస్తారు? పిల్లవాడు ఏ విధంగా మంచి స్కోరు సాధిస్తాడు?

 కాబట్టి మీరందరూ ఎఫ్ఏ పరీక్షగా వచ్చే ఎస్సే పరీక్ష కావచ్చు పరీక్ష జరగడానికి ముందు సిలబస్ కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.

 ✍️ ఎలక్షన్ కమిషనర్  గారు ఏ విధంగా అయితే ఎలక్షన్ సమర్థవంతంగా  నిర్వహిస్తారో.... అదే విధంగా పాఠశాలలో విద్యా రంగంలోని అన్ని స్థాయిలోనే అధికారులు ఉపాధ్యాయులు అందరూ కలిసి పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించి మన ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగాన్ని  విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. 

 ✍️ గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పైన చేస్తున్నటువంటి ఖర్చు దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు చేయడానికి కూడా వెనకడం లేదు కావున ఇంత మొత్తం డబ్బు వెచ్చించడం ఆ డబ్బుని సరిపడా విధంగా ఫలితాలను కూడా మనం రాబట్టాలి.

 *✍️ పాయింట్ నెంబర్ టు ..

ఫ్లాట్ షిప్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వెదర్ ఇట్ ఇస్ జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక ,

నాడు నేడు ఈ కార్యక్రమంలో నాణ్యత పైన ఎలాంటి రాజీ లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయుని కోరారు. పాఠశాలకు సరఫరా చేయబడు జగనన్న విద్యా కానుక మరియు జగనన్న గోరుముద్దలో భాగంగా చిక్కి గుడ్డు నాణ్యతలో లోపాలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానోపాధ్యాయులు స్వీకరించరాదని అలాగే ఎలాంటి అసౌకర్యాలు పై కార్యక్రమాలు అమల్లో ఏర్పడిన వెంటనే తన వాట్స్అప్ నెంబర్ కు ఏ ఉపాధ్యాయ మిత్రుడైనా కూడా సందేశం పంపవచ్చని తెలిపారు.

*(9013133636  whats App Number)*

 ✍️ అలాగే నాడు నేడు పాఠశాలలో ఫేస్ వన్ కింద చాలా చక్కగా ఉన్న పాఠశాలలో ముఖ్యంగా మరుగుదొడ్లు మరియు త్రాగునీరు పై అధిక శ్రద్ధ వహించాలని కోరారు .

✍️ నాడు నేడు ఉన్నత పాఠశాలలో నైట్ వాచ్మెన్ నియామకానికి మొదట ప్రాధాన్యతగా ఆయా యొక్క హస్బెండ్, ను  లేనిపక్షంలో ఆ గ్రామంలోని ఎక్స్ సర్వీస్ మెన్ తరువాత ఇతరులను నియమించుకోవచ్చు అని తెలిపారు .

✍️ నాలుగవ పాయింట్ గా రాగి జావా ప్రోగ్రాం కూడా పాఠశాలల్లో తప్పకుండా అమలు చేయాలని తెలిపారు బై జ్యూస్ టాబ్లు మరియు ఇంటర్ ఆక్టివ్ పానల్స్ రాబోయే విద్యా సంవత్సరానికి 30 వేల పాఠశాలలకి ఏర్పాటు చేయబోతున్నారని రానున్న విద్యా సంవత్సరం ని ఒక డిజిటలైజేషన్ ద్వారా బోధన  చేయాలని బైజుస్ ట్యాబ్ లోని వీడియోలన్నీ ఆ సంబంధిత ఉపాధ్యాయులు ఈ వేసవి సెలవుల్లో పూర్తిగా చూసి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాబోయే విద్యా సంవత్సరంలో బోధనలో డిజిటల్ కంటెంట్ ని వినియోగించాలని కోరారు.

✍️ చివరగా రాబోయే ఫైనల్ పరీక్ష లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

★★★★★★★★★★★★★★★★★★★★★★★

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 23/02/23 మూడో వీడియోలోని సందేశం

3rd Video Direct Link : https://youtu.be/W-rr4cnXqPk

ఈ వీడియోలో రెండు అంశాలు కలవు

1. విధి నిర్వహణకు సంబంధించి,

2. డిజిటల్ ఎడ్యుకేషన్.

నేను ఉపాధ్యాయుల పనితీరులో పాఠశాలలో గమనించినటువంటి అంశాలు

1. సిలబస్ పూర్తి చేయకపోవటం,

2. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేయకపోవడం,

3. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేసి నోట్ బుక్స్ కరెక్షన్ చేయకపోవడం, 

4. యాంత్రికంగా సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేసి కరెక్షన్ వర్క్ మెకానికల్ గా చేయడం టిక్కులు పెట్టడం తప్పులను సరిచేయకపోవడం, ఉపాధ్యాయుల కరెక్షన్ వర్క్ లో క్వాలిటీ లేకపోవడం. మడకశిరలో పనిచేస్తున్న ఎస్జీటీ శోభా రాణి గారు అంకితభావంతో పనిచేసినట్లు పరిశీలనలో తెలిసినది. శోభారాణి వంటి అంకిత భావం గల ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కావాలి.

క్వాలిటీ ఆఫ్ కరేక్షస్ వర్క్ లో నా సూచనలు:-

1. ప్రతిరోజు కొన్ని నోట్స్ లు దిద్దాలి. వారానికి నెలకో కాకుండా ప్రతిరోజు విద్యార్థుల యొక్క తప్పులను సరిదిద్దాలి, కరెక్షన్ చేయాలి.

2. ఉపాధ్యాయులు అధికారుల పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

3. ఎవరి స్థాయిలో వారు హార్డ్ worked గా ఉండాలి. RJDSE, DEO, DYEO, MEO, HM, TEACHERS అందరూ తమ ధర్మాన్ని నిర్వర్తించాలి.

4. ప్రిన్సిపల్ సెక్రెటరీగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను.

5. దీనిలో ఎటువంటి పబ్లిసిటీకి అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకుని సహకరించండి. విద్యా శాఖ యొక్క ప్రధాన కేంద్రం/లక్ష్యం ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే అభ్యసన ప్రక్రియ.

Components of best policy(As per the best professor of the Masters in Public policy): Minimum gap between policy and implementation.

మనం అందరం policy కి ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని క్షేత్ర స్థాయిలో సాధ్యమైనంత గా తగ్గించాలి. 

6. ప్రభుత్వం కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాన్ని క్రింది స్థాయి వరకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరి పై ఉన్నది.

7. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు రాయబారిని, సంధానకర్తను, నాయకుడను, ఛాంపియన్ ను.

8. ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత పి ఎస్ గా నాపై ఉన్నది. అదే నా ధర్మం నా బాధ్యత.

9. అందరిలో పాజిటివ్ థింకింగ్ రావాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గ్యాప్ రాకూడదు. అందరూ సమన్వయంతో పని చేయాలి. లేకపోతే ప్రభుత్వ పథకాలు నీరుగారి పోతాయి.

సమస్యకు మూలాలు:-

లీనియర్ థింకింగ్ లేకపోవడం మరియు looking the work in different dimensions,పనిచేయడం లో మల్టీ టాస్కింగ్ ....ఎందుకుచేయాలి...చెయ్యకపోతే ఎమి అవుతుంది.... లాంటి వ్యతిరేక దృక్పథం...వానిని విడనాడాలి. సకారత్మక దృక్పథం తో ముందుకు వెళ్లాలి.

రెండో అంశము డిజిటల్ ఎడ్యుకేషన్:-

ప్రభుత్వం కోట్ల రూపాయలతో 8 వ తరగతి విద్యార్థులకు టాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇందుకోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. టాబ్స్ యూసేజ్ సక్రమంగా లేకపోవడం గమనించడం జరిగింది.

1. జిల్లా స్థాయి అధికారులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ ట్యాబ్ ఏ విధంగా ఉపయోగించాలి అని తెలిసి ఉండాలి.

2. మనకే ట్యాబ్ ఉపయోగించడం ప్రావీణ్యం లేకపోతే విద్యార్థులకు ఎలా చెప్పగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరికి టెక్నాలజీ పై అవగాహన ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరాలి.

3. అధికారులు కానీ కొంతమంది టీచర్లు అసలు ఒక్క పాఠం కూడా వీడియో కూడా చూడలేదు. శ్రీనివాస్ మాస్టారు, పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, గుడివాడ, అభినందనీయుడు. బైజుస్ యాప్ నందు ఉన్న సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్ ను పూర్తిగా చూడడం జరిగింది అని చెప్పారు. శ్రీనివాస్ లాంటి ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కావాలి మనకు.

4. దయచేసి FA-4, SA-2, బైజూస్ పాఠాలు విద్యార్థులు కు అందించవలసిందిగా సూచించడం అయింది. 5. దయచేసి అందరూ మూడు వీడియోలు చూసి దానిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు తెలుసుకొని విద్యార్థులను నేర్చుకోవడం ప్రక్రియలో ప్రోత్సహించ వలసినదిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను.

ఆల్ ది బెస్ట్.

ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రెటరీ

★★★★★★★★★★★★★★★★★★★★


గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 25/01/23 రెండవ వీడియోలోని ముఖ్య అంశముల

 2nd Video Direct Link : https://youtu.be/Sz9gO7kIwYU

అభ్యసన ప్రక్రియలలో transaction అనేది ప్రధాన అంశము. ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మధ్యన ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలి దీనిలోని ముఖ్యాంశములు...

1. సిలబస్:- తగిన సమయానికి సిలబస్ పూర్తి చేయబడాలి. విద్యా సంవత్సరంలోని 220 రోజులకు గాను ఈ ప్రణాళిక సక్రమంగా అమలు జరగాలి

2.Notes by Students:- విద్యార్థులు రాసుకున్న పుస్తకాలను ఉపాధ్యాయులు ప్రతి పదాన్ని చదివి తప్పులను సరి చేయాలి ఒకటి నుండి 5వ తరగతి వరకు Work Books ఇవ్వబడ్డాయి. వీరికి నోట్ బుక్స్ లేవు ఎందుకంటే వర్క్ బుక్ నే నోట్ బుక్స్ గా పరిగణించాలి. నేను కొన్ని పాఠశాలలు సందర్శించినప్పుడు సిలబస్ విషయంలోనూ మరియు నోట్ బుక్స్ లేదా వర్క్ బుక్స్ కరెక్షన్ విషయంలో చాలా విషయాలు గమనించాను సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయులను వర్క్ బుక్స్ ను కరెక్ట్ చేయని ఉపాధ్యాయులను చాలామందిని గమనించాను కొన్ని పాఠశాలలలో కనీసం ఒక్క పేజీని కూడా రాయించని పరిస్థితి గమనించాను. ఈ విషయంలో సూపర్వైజింగ్ అధికారులు నా విజిట్ నందు ప్రశ్నించబడతారు.

ఈ అంశాలను సక్రమంగా నెరవేర్చకపోతే ట్రాన్సాక్షన్ అనే ప్రక్రియ కుంటుపడుతుంది. ఉన్నత పాఠశాలల యందు 6 నుండి 10వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ లు విద్యార్థుల పట్ల ఖచ్చితమైన శ్రద్ధ వహించాలి దీనిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలి. రెండు ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా ఉండాలి 

1. ఇంటరాక్టివ్ ఫ్లాగ్ ప్యానల్

2. బైజూస్ కంటెంట్.. 8 నుండి 10వ తరగతి వరకు

ఇంటరాక్టివ్ ఫ్లాగ్ ప్యానెల్ లో అధికారులు క్రింది స్థాయి అధికారులతో మరియు ఉపాధ్యాయులతో పాఠశాల విజిట్ సందర్భంగా చర్చించి ప్రణాళికలు సక్రమంగా అమలు అయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలి సమస్యలు పరిష్కరించాలి. కంటెంట్ కు సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడు బైజుస్ కంటెంట్ను తరచుగా చూసి రాబోయే విద్యా సంవత్సరానికి అనగా 2023 2024 విద్యాసంవత్సరానికి విద్యా వార్షిక ప్రణాళికలు బైజుస్ కంటెంట్కు అనుగుణంగా తయారు చేయాలి.

ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్లు చిక్కీలు మొదలైన వాటి విషయంలో ఏదైనా తేడా ఉంటే యాప్ నందు టికెట్ రైజ్ చేయాలి. క్వాలిటీ మరియు మెయింటెనెన్స్ ఈ రెండు విషయాలు అమలు అయ్యేలా చూడటం పంపిణీ చేయు అధికారుల యొక్క బాధ్యత వీటిలో ఏదైనా తేడా ఉన్న ఎడల టికెట్ రైజ్ చేయవచ్చును. దీనికి సంబంధించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈఓ, ఇంజనీర్లు, వెల్ఫేర్ కార్పొరేషన్ సిబ్బంది బాధ్యులుగా పరిగణించబడతారు.

పై విషయాలను సక్రమంగా అమలు చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రెటరీ

★★★★★★★★★★★★★★★★★★★★

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి 29/12/22 మొదటి వీడియోలోని సందేశం

 First Video Direct Link : https://youtu.be/jJWGVENhAes

నేను డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించదల్చుకున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే మన ప్రభుత్వానికి విద్యారంగానికి సంబంధించి ఉన్న ఆలోచన సరళి ఏమిటి? అదే ఆలోచన సరళిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఎకడమిక్ సిబ్బంది మరియు నాన్ ఎకడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరియు ప్రభుత్వం యొక్క నిర్దేశిత లక్ష్యాలను ఎలా సాధించగలము అనేది వివరించదల్చుకున్నాను. మనం భౌతిక శాస్త్రంలో అనునాదం గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే మనము ఫలితాలను మరింత వేగవంతముగా ప్రభావవంతముగా పొందగలము.

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా సెక్రటేరియట్ లోను విభాగాధిపతుల కార్యాలయాలలోనూ క్షేత్ర పర్యటనలలోనూ విద్యాశాఖ పనితీరును సమీక్షించటం జరుగుచున్నది క్షేత్ర పర్యటనలలో నా యొక్క అనుభవాలను మీతో పంచుకోవడం కోసం ఇకపై ప్రతినెల చివరి వారంలో ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గ్రామ సచివాలయాల్లోని విద్యాశాఖకు సంబంధించిన సిబ్బంది మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఉప విద్యాశాఖ అధికారుల కార్యాలయ సిబ్బంది జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది విద్యాశాఖ కమిషన్ రేట్ సిబ్బంది సెక్రటేరియట్ సిబ్బంది అందరూ భాగస్వాములుగా ఉండాలి.

ఈ మొదటి వీడియోలో ఐదు అంశాల గురించి మీతో చర్చిస్తాను.

మొదటి అంశం: TAB ల వినియోగం

గత 20 నుండి 25 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బోధనాభ్యాసనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అభివృద్ధి చెందుతూ వస్తుంది అయితే మరి ఏ ఇతర దేశంలోనూ లేని విధంగా, మనదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధముగా ఒకేసారి 4లక్షల 60 వేల మంది 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు 60 వేల మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు TAB లను అందించటం జరిగింది. వీటి యొక్క వినియోగానికి సంబంధించి నాలుగు అంశాలను మనం చూసినట్లయితే మొదటగా సాంసంగ్ కంపెనీ వారికి చెందిన నాణ్యమైన ఆకర్షణీయమైన TAB లను విద్యార్థులకు అందించాము వాటికి భద్రత కలిగిన SD కార్డులను ఏర్పాటు చేసాము BY JUS వారి నాణ్యమైన కంటెంట్ ను విద్యార్థులకు అందించాము. పై చర్యల ద్వారా మనం కేవలం 50 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించగలిగాము మిగిలిన 50 శాతం వాటి వినియోగంపై ఆధారపడి ఉంది. ఇది ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు మాత్రమే సాధించగలరు. విద్యార్థులకు ట్యాబుల యొక్క వినియోగం గురించి 21 రోజులు చెప్పినట్లయితే అది వారికి అలవాటుగా మారుతుంది అదే విద్యార్థులకు 90 రోజులపాటు టాబుల వినియోగం గురించి చెప్పినట్లయితే వారు ట్యాబుల వినియోగాన్ని తమ జీవన శైలిగా మార్చుకొనగలరు.

రెండవ అంశం: బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు

మనదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో రెట్టింపు ఖర్చుతోటైలింగ్యువల్ పాఠ్యపుస్తకములను ముద్రించటం జరిగినది. గత మూడు సంవత్సరాలుగా ఈ పుస్తకాలను మనం విద్యార్థులకు అందిస్తున్నాము

ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రశ్న పత్రములను సైతం రెండు భాషల్లో ముద్రిస్తున్నాము అయినప్పటికీ కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మ్యాథమెటిక్స్ లేదా సైన్సెస్ ఆంగ్ల భాషను అందుకోగలుగుతున్నారు నాలుగో తరగతి నుండి 8వ తరగతి వరకు మనం టార్గెట్గా ఉంచుకొని మనం పని చేయవలసి ఉంది.

మూడవ అంశం: జగనన్న విద్యా కానుక

దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్లకు పైగా ఖర్చుపెట్టి స్కూల్ బ్యాగ్ బూట్లు నోట్ పుస్తకములు బెల్టు వంటి పది రకాలకు పైగా వస్తువులను మనం విద్యార్థులకు అందిస్తున్నాము నేను ఇటీవల 20 కిలోమీటర్ల దూరంలోని ఒక పాఠశాలను సందర్శించినప్పుడు ఆ పాఠశాలలోని ఏ ఒక్క విద్యార్థి కూడా బూట్లు ధరించి గాని లేదా బెల్టును ధరించి గాని కనిపించలేదు ఇది బాధాకరమైన విషయం కనుక ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరూ ప్రతి రోజు విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా జగనన్న విద్యా కానుక ద్వారా అందించబడిన వస్తువులను ఉపయోగించే అలవాటును విద్యార్ధులలో పెంపొందించాలి.

నాలుగవ అంశం: జగనన్న గోరుముద్ద

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో గాని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి రెట్టింపుకు పైగా వ్యయం జరుగుచున్నది. జగనన్న గోరుముద్ద పథకాన్ని సక్రమంగా నిర్వహించాలంటే ఆ పథకానికి అవసరమైన గుడ్లు చిక్కీ ల వివరాలు ఎప్పటికప్పుడు మనము యాప్ లో అప్లోడ్ చేయాలి అప్పుడే మనకు అవసరమైన ఇండెంట్ జనరేట్ అవుతుంది మనము సకాలంలో విద్యార్థులకు అందించగలము.

ఐదవ అంశము: నాడు నేడు

నాడు నేడు పథకంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మనదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ఈ పథకం ద్వారా జరుగుచున్నది. ఈ పథకం ద్వారా పాఠశాలలో నిర్వహింపబడే టాయిలెట్ల మెయింటెనెన్స్, ఆర్ వో సిస్టమ్స్, బెంచీలు సక్రమంగా మెయింటెనెన్స్ జరగాలి. మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలి.

అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

మీ

ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రెటరీ



Thanks for reading From The Desk of Principal Secretary School Education Programme YouTube Live

No comments:

Post a Comment