IDBI: ఐడీబీఐ బ్యాంక్-600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 600
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
పని అనుభవం: బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(మైక్రో ఫైనాన్స్ సంస్థలు/నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు/ సహకార బ్యాంకులు/ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/ ఫిన్‌టెక్ కంపెనీలు)/ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో కనీసం 02 ఏళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.
వయసు: 21-30 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.36000-రూ.63840 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రి రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్‌లైన్ పరీక్షకు 2 గంటలు సమయం ఉంటుంది. అందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 60 మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లిష్ ల్యాంగ్వేజీ నుంచి 40 ప్రశ్నలకు గాను 40 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు ఉంటాయి. జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్అ వేర్‌నెస్/ కంప్యూటర్/ఐటీ నుంచి 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి.
* ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 28.02.2023.
ఆన్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 2023.
Thanks for reading IDBI: IDBI Bank-600 Assistant Manager Posts
No comments:
Post a Comment