Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 6, 2023

iRCTC Latest Update: Now food delivery in trains through WhatsApp.. How to order?


 IRCTC Latest Update: రైళ్లలో ఇకపై వాట్సాప్ ద్వారా ఫుడ్ డెలివరీ.. ఆర్డర్ ఎలా చేయాలంటే?

న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త రూపు సంతరించుకుంటున్న భారతీయ రైల్వే(Indian Railway) టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటోంది.

రైల్వే ప్రయాణికులకు ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. వాట్సాప్ ద్వారా ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఆహారాన్ని పీఎన్ఆర్ నంబరు ఆధారంగా డెలివరీ చేయనుంది.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తన వెబ్‌సైట్ www.catering.irctc.co.in ద్వారా కేటరింగ్ సేవలను అందిస్తోంది. అలాగే, 'ఫుడ్ ఆన్ ట్రాక్' (Food On Track) అనే యాప్ ద్వారా కూడా కేటరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఎలా?

ఈ-క్యాటరింగ్ సేవలను కస్టమర్ కేంద్రంగా మార్చే దిశగా భారతీయ రైల్వే మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా కొత్త సేవలను ప్రారంభించింది. వీటి కోసం ప్రత్యేకంగా +91-8750001323ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని ఐఆర్‌సీటీసీ ప్లాన్ చేసింది. మొదటి దశలో వాట్సాప్(Whatsapp) నంబరు నుంచి ప్రయాణికుడికి ఓ మెసేజ్ పంపుతుంది. ఈ www.ecatering.irctc.co.in.ను క్లిక్ చేయడం ద్వారా క్యాటరింగ్ సేవలు ఎంచుకోవాలని సూచిస్తుంది.

ఈ ఆప్షన్ వల్ల ప్రయాణికులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రయాణిస్తున్న మార్గంలో స్టేషన్లలో అందుబాటులో ఉన్న రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇక, రెండో దశలో వాట్సాప్ నంబరు ద్వారా నేరుగా ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబరు ఇంటరాక్టివ్ టు వే కమ్యూనికేషన్‌గా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్ చాట్‌బాట్ ప్రయాణికుడితో మెసేజ్‌ల ద్వారా సంభాషిస్తుంది. ప్రయాణికుడు తగిన ఆహారాన్ని బుక్ చేసుకునేందుకు సాయపడుతుంది.

వాట్సాప్ ఈ-క్యాటరింగ్ సేవలను తొలుత కొన్ని రైళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్, సూచనల ఆధారంగా ఇతర రైళ్లకు కూడా ఈ సేవలను విస్తరించనుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ సేవల ద్వారా రోజుకు 50 వేల భోజనాలను సరఫరా చేస్తోంది.

Thanks for reading iRCTC Latest Update: Now food delivery in trains through WhatsApp.. How to order?

No comments:

Post a Comment