Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 24, 2023

NPS Rule Change: NPS new rules will come into effect from April 1.


 NPS Rule Change: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి NPS కొత్త నియమాలు.. గమనించాల్సిన మార్పులివే..!

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది పెన్షన్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పథకం. రిటైర్‌మెంట్‌ తర్వాత వృద్ధులకు స్థిరమైన పెన్షన్‌ అందుకొనే అవకాశం కల్పిస్తుంది.

ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తానికి మెరుగైన ఆదాయం, ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ కూడా లభిస్తాయి. ఎన్‌పీఎస్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఎన్‌పీఎస్‌ సబ్‌స్క్రైబర్‌లు సెలక్ట్ డాక్యుమెంట్‌లు అప్‌లోడ్‌ చేయడాన్ని PFRDA తప్పనిసరి చేసింది. NPS నుంచి సబ్‌స్క్రైబర్లు ఎగ్జిట్‌ అవుతున్న సమయంలో యాన్యుటీ చెల్లింపులను వేగంగా, సరళంగా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

* సబ్‌స్క్రైబర్‌లు గమనించాల్సిన మార్పులు?

సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ(CRA) యూజర్ ఇంటర్‌ఫేస్‌లో సబ్‌స్క్రైబర్‌లు, సంబంధిత నోడల్ అధికారులు/POPలు/కార్పొరేట్‌లు కొన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాలని PFRDA సూచించింది. అందులో NPS ఎగ్జిట్‌/విత్‌డ్రా ఫారం, ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ(విత్‌డ్రా ఫారంలోని అడ్రెస్‌తో సరిపోలాలి), బ్యాంక్‌ అకౌంట్ ప్రూఫ్, పాన్‌ కార్డ్‌ కాపీ ఉన్నాయి. అన్ని నోడల్ ఆఫీస్‌లు/ POPలు/కార్పొరేట్‌లు సంబంధిత సబ్‌స్క్రైబర్‌లకు డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేయడంపై అవగాహన కల్పిస్తాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

* పేపర్‌లెస్ మోడ్‌లో సబ్‌స్క్రైబర్‌(గవర్నమెంట్‌/నాన్‌ గవర్నమెంట్) ఎగ్జిట్‌ రిక్వెస్ట్‌ చేయడం ఎలా?

CRA సిస్టమ్‌లోకి లాగిన్ చేయడం ద్వారా సబ్‌స్క్రైబర్‌ ఆన్‌లైన్ ఎగ్జిట్‌ రిక్వెస్ట్‌ను చేయవచ్చు. రిక్వెస్ట్‌ చేసే సమయంలో, ఇ-సైన్/OTP అథెంటికేషన్‌, నోడల్ ఆఫీస్/POP రిక్వెస్ట్‌ ఆథరైజేషన్‌కి సంబంధించిన మెసేజ్‌లు స్క్రీన్‌పై సబ్‌స్క్రైబర్‌కి డిస్‌ప్లే అవుతాయి. రిక్వెస్ట్‌ చేసే సమయంలో అడ్రెస్‌, బ్యాంక్ వివరాలు, నామినీ వివరాలు వంటివి NPS అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. సబ్‌స్క్రైబర్ లంప్‌సమ్‌ /యాన్యుటీ, యాన్యుటీ వివరాలు మొదలైన వాటి కోసం ఫండ్ అలొకేషన్‌ శాతాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్‌ వెరిఫికేషన్‌(పెన్నీ డ్రాప్ ఫెసిలిటీ) ద్వారా సబ్‌స్క్రైబర్‌ల బ్యాంక్ అకౌంట్‌(CRAలో రిజిస్టర్‌ చేసింది) వెరిఫై అవుతుంది.

సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా విత్‌డ్రా రిక్వెస్ట్‌ చేసే సమయంలో KYC డాక్యుమెంట్లు(ఐడెంటిటీ, అడ్రెస్‌ ప్రూఫ్‌), PRAN కార్డ్/ePRAN కాపీ, బ్యాంక్ ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేయాలి. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. పేపర్‌లెస్‌ ప్రాసెస్‌ ద్వారా రిక్వెస్ట్‌ ఆథరైజ్‌ చేయడానికి సబ్‌స్క్రైబర్‌కు రెండు మార్గాలు ఉన్నాయి..

1) OTP అథెంటికేషన్‌: విభిన్న OTPలు సబ్‌స్క్రైబర్‌ల మొబైల్ నంబర్‌, ఇమెయిల్ IDలకు వస్తాయి.

2) ఇ-సైన్ : సబ్‌స్క్రైబర్‌లు ఆధార్‌ని ఉపయోగించి రిక్వెస్ట్‌పై ఇ-సైన్ చేస్తారు.

* NPS విత్‌డ్రా ప్రాసెస్‌ తొలగింపు

NPS సబ్‌స్క్రైబర్‌ విత్‌డ్రా ప్రాసెస్‌ సులభతరం చేయడానికి PFRDA కొన్ని చర్యలు తీసుకొంది. పెన్షన్ కార్పస్ నుంచి ఎగ్జిట్‌ అయిన తర్వాత యాన్యుటీని ఎంచుకోవడానికి ప్రత్యేక ప్రపోజల్‌ ఫారం పూరించవలసిన అవసరాన్ని తొలగించింది. సబ్‌స్క్రైబర్‌లు సమర్పించిన ఎగ్జిట్ ఫారంను యాన్యుటీ ప్రపోజల్ ఫారంగా పరిగణిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి NPS సబ్‌స్క్రైబర్ ప్రస్తుతం మొత్తం కార్పస్‌లో కనీసం 40 శాతాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని లంప్‌సమ్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు.

Thanks for reading NPS Rule Change: NPS new rules will come into effect from April 1.

No comments:

Post a Comment