Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 13, 2023

Should you buy a house.. should you stay on rent..? What is the greatest benefit?


 ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా..? దేనివల్ల అధిక ప్రయోజనం

రెండింటికీ పన్ను ప్రయోజనాలు

అవసరాన్ని బట్టి నిర్ణయం

వేర్వేరుగా పన్ను భారం

రుణంపై ఇంటితో ఆస్తి సమకూరినట్లే

కానీ అద్దెతో పోలిస్తే రుణ ఈఎంఐ అధికం

సొంతంగా ఇల్లు సమకూర్చుకోవాలా..? లేదంటే అద్దె ఇంట్లో ఉంటే ప్రయోనమా? ఈ విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి గణాంకాల సహితంగా తెలుసుకుంటే కానీ, తీరే సందేహం కాదు ఇది. అప్పు తీసుకుని అయినా ఇల్లు సమకూర్చుకోవాలని, అదే లాభదాయకమని కొందరు బలంగా నమ్ముతుంటారు. భూ మి ధర ఎప్పటికైనా పెరిగేదే కదా, దీనితో ఆస్తి విలువ ఇతోధికం అవుతుందని భావిస్తుంటారు.

కానీ, గతంలో ఉన్నంతగా భూమి విలువ వృద్ధి ఇక ముందూ ఉంటుందని చెప్పలేం. అలాగే, సొంతిల్లు పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉంటుందని కూడా చెప్పలేం. ఇదే నిజమైతే కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు రోజూ అదనపు సమయం, ఇంధనం రూపేణా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కానీ, ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. ఎన్నో జ్ఞాపకాలు, కలల నిలయం అని ఎక్కువ మంది చెబుతారు. కనుక సొంతింటి కలను రుణం రూపంలో నెరవేర్చుకుంటే లేదా అద్దె ఇంట్లో ఉంటే పన్ను కోణంలో ఉండే లాభ, నష్టాలను తెలుసుకుందాం.

సొంతింటి కల..

రుణంపై సొంత ఇంటిని సమకూర్చుకుంటే మంచి పన్ను ఆదా ప్రయోజనాలు 'ఆదాయపన్ను పాత విధానం'లో ఉన్నాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐ మొత్తంలో అసలు, వడ్డీ రెండు భాగాలు. ఈఎంఐలో భాగంగా చెల్లించే రుణం అసలును సెక్షన్‌ 80సీ కింద క్లెయిమ్‌ చేయొచ్చు. అలాగే, ఇంటి కొనుగోలుకు చెల్లించిన స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులను కూడా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు.

వడ్డీ విషయానికొస్తే.. కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉండేవారు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ భాగం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.2 లక్షల మొత్తంపై పన్ను చెల్లించక్కర్లేదు. అంటే ఆదాయంలో రూ.2 లక్షల మేర గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీ కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే.. ఆ ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీతోపాటు ఆ ఇంటికి చెల్లించే మున్సిపల్‌ ట్యాక్స్, అద్దె ఆదాయంలో 30 శాతాన్ని స్టాండర్డ్‌ డిడక్షన్‌ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులను సెక్షన్‌ 80ఈఈఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కాకపోతే సదరు రుణం 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో మంజూరై ఉండాలి. ఇంటి స్టాంప్‌ డ్యూటీ విలువ రూ.45లక్షలు మించకూడదన్నది షరతు. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రయోజనాలు ఆదాయపన్ను కొత్త విధానంలో లేవు.

సెటాఫ్, క్యారీఫార్వార్డ్‌

రుణంపై కొనుగోలు చేసిన ఇంటిలో సొంతంగా నివసించే వారు అద్దె రూపంలో ఎలాంటి ఆదాయం లేనట్టయితే.. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీని నష్టంగా చట్టం పరిగణిస్తుంది. దీన్ని వేతనం, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం కింద సర్దుబాటు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వడ్డీ మొత్తం ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఆ నష్టాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో (క్యారీ ఫార్వార్డ్‌) ఇతర ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ ఇళ్లు కలిగి ఉంటే నోషనల్‌ రెంట్‌ అంశం తెరపైకి వస్తుంది. రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగించుకుంటున్నారని అనుకుంటే, మిగిలిన ఇళ్లను అద్దెకు ఇచ్చినా ఇవ్వకపోయినా.. చట్టం కింద ఇచ్చినట్టుగానే పరిగణిస్తారు. మార్కెట్‌లో ఉన్న సగటు అద్దె ధరలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అనుకూలతలు: అద్దె ఇంటితో పోలిస్తే సొంతిల్లు తీసుకోవడం వల్ల ఆస్తి సమకూరుతుంది. ఇంటి రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. 

ప్రతికూలతలు: రుణంపై తీసుకున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారుడు డౌన్‌ పేమెంట్‌ కింద తన వంతు వాటా కట్టాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్‌లను ఏటా చెల్లించాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు అదనం. ఇంటికి మరమ్మతుల కోసం వెచ్చించాలి. విక్రయించాలంటే వెంటనే అమ్ముడుపోకపోవచ్చు. అంటే లిక్విడిటీ తక్కువ. ప్రాపర్టీ ధర పెరుగుతుందని, గణనీయంగా పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఉద్యోగం లేదా ఆదాయం నిలిచిపోయినా రుణం, దానిపై వడ్డీ చెల్లించాల్సిందే. చిన్న ఇంటికి వెళ్లి అద్దె భారం తగ్గించుకునే అవకాశం ఉండదు.

అద్దె ఇంట్లో ఉండే వారికి

కంపెనీలు తమ ఉద్యోగులకు హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) ని వేతనంలో భాగంగా ఇస్తుంటాయి. ఈ భాగానికి పన్ను ప్రయోజనం ఉంటుంది. స్థూల పన్ను వేతనంలో గరిష్టంగా రూ.5,000 వరకు ఉంటుంది. కాకపోతే హెచ్‌ఆర్‌ఏకి పన్ను మినహాయింపు పొందాలంటే పనిచేస్తున్న కార్యాలయం ప్రాంతంలోనే సొంత ఇల్లు కలిగి ఉండకూడదనేది షరతు. 

పన్ను ప్రయోజనాలు: అద్దె ఇంట్లో ఉండేవారు, వేతనంలో భాగంగా పొందిన హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కాకపోతే, హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపునకు కొన్ని షరతులు ఉన్నాయి. మూల వేతనం, కరువు భత్యం మొత్తంలో 10 శాతం. లేదంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో నివసించే వారు వేతనంలో 50 శాతం, మిగిలిన పట్టణాల్లో నివసించే వారు 40 శాతాన్ని హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. లేదా అసలు హెచ్‌ఆర్‌ఏ రూపంలో తీసుకున్న మొత్తం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తంపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవడానికి ఆదాయపన్ను చట్టం అనుమతిస్తుంది.

అనుకూలతలు: రుణంతో ఇల్లు కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన ఈఎంఐ కంటే, అద్దె ఇంటి కోసం చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. అద్దె ఇల్లు అయితే పనిచేసే ప్రాంతానికి అతి సమీపంలో లేదా కావాల్సిన చోట ఉండొచ్చు. సొంతిల్లు అయితే అందుబాటు ధర కోసం, పట్టణానికి వెలుపలి ప్రాంతాల్లో కొనుగోలు చేయాల్సి (ఎక్కువ మంది విషయంలో) వస్తుంది. అద్దె ఇ్లలు అయితే కోరుకున్నప్పుడు ఇల్లు మారిపోవడం సులభం. చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు.

ప్రతికూలతలు: అద్దె ఇంట్లో ఉంటే ఆస్తి సమకూరదు. ఏటా అద్దె పెరుగుతూ ఉంటుంది. నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకోలేరు. ఇంటి యజమానికి నచ్చకపోయినా ఖాళీ చేయాల్సి వస్తుంది.

ఎవరికి ఎలా ప్రయోజనం..?

A అనే వ్యక్తి స్థూల వార్షిక ఆదాయం రూ.20లక్షలు. నెలవారీగా అద్దె కింద రూ.30వేలు చెల్లిస్తున్నాడు. B అనే వ్యక్తి వార్షిక ఆదాయం కూడా రూ.20 లక్షలే. కానీ, అతడు సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటి రుణంపై ఏటా రూ.3 లక్షలు వడ్డీ కింద, రూ.1.5 లక్షలు అసలు కింద చెల్లిస్తున్నాడు. ఇప్పుడు వీరికి నికర పన్ను భారం (ఆదాయపన్ను పాత విధానం కింద) ఎలా ఉంటుందని చూస్తే.. 

A    ..............................    B

మూల వేతనం (రూ.లలో) 10,00,00 10,00,000

హెచ్‌ఆర్‌ఏ 5,00,000 5,00,000

స్పెషల్‌ అలవెన్స్‌ 5,00,000 5,00,000

స్థూల వేతనం 20,00,000 20,00,000

హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు -2,60,000 ...

స్టాండర్డ్‌ డిడక్షన్‌ -50,000 -50,000

నికర వేతనం 16,90,000 19,50,000

ఇంటిపై ఆదాయం ... -2,00,00

స్థూల మొత్తం ఆదాయం 16,90,000 17,50,000

80సీ డిడక్షన్‌ 1,50,000 1,50,000

నికర పన్ను ఆదాయం 15,40,000 16,00,000

మొత్తం పన్ను 2,85,480 3,04,200

Thanks for reading Should you buy a house.. should you stay on rent..? What is the greatest benefit?

No comments:

Post a Comment