Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, February 28, 2023

You can easily check your CIBIL score on WhatsApp like this..


 CIBIL Score Check: మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసా ?.. వాట్సప్‌లో మీ సిబిల్ స్కోర్‌ను సులభంగా ఇలా చెక్ చేసుకోవచ్చు.. ట్రై చేయండి.

మన ఆర్ధిక ప్రణాళిక ఎలా సాగుతోంది..? మన వ్యక్తిగత బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి..? ఇలాంటి చాలా విషయాలను మన క్రెడిట్ స్కోర్ బయటక పెడుతుంది. అయితే ఈ స్కోర్ ఎలా తెలుసుకోవాలన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. దీని కోసం నెట్ మొత్తం జల్లడ పట్టాల్సిన అవసరం లేదు. నేరుగా మన వాట్సప్ దారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందు..

మీరు రుణం కోసం దరఖాస్తు చేయబోతున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. ఈ వార్తలో మీకు మీ క్రెడిట్ స్కోర్ గురించి చెప్పబోతున్నాం. దీని సహాయంతో మీరు రుణం తీసుకోవడం చాలా సులభం అవుతుంది. హోమ్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా ఏ రకమైన లోన్ అయినా పొందాలంటే మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే మీరు మీరు పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా ముందుగా మన క్రెడిట్ స్కోర్ బెటర్‌గా ఉండాలి. క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా.. బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చూస్తాయి. క్రెడిట్ స్కోర్ వల్ల రుణ గ్రహీత ఆర్థిక పరిస్థితులపై బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి. క్రెడిట్ స్కోర్ ద్వారా బ్యాంకులు లోన్ డిఫాల్ట్‌లు ఏమైనా ఉన్నాయా..?  ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఆ తర్వాతే మీకు లోన్ మంజూరు చేస్తాయి. అయితే చాలా కంపెనీలు మార్కెట్లో క్రెడిట్ స్కోర్ ఫ్రీగా అందిస్తున్నాయి.

అయితే తాజాగా ఎక్స్‌పీరియన్ ఇండియా ఈ సేవను ప్రారంభించింది. కొంతమంది రుణం తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం మర్చిపోతారు. తమ క్రెడిట్ స్కోర్ చూసుకోకుండానే లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. దీని కారణంగా వారు చాలాసార్లు లోన్ పొందలేక పోతారు. ఎందుకు లోన్ లభించడం లేదో కూడా వారికి అర్థం కాదు. ఎందుకు లోన్ ఇవ్వడం లేదో కూడా తెలుసుకోరు. ఇలాంటి సమయంలో స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో వారికి తెలియదు. ఇప్పుడు ఎక్స్‌పీరియన్ ఇండియా కొత్త సర్వీస్ కింద.. వాట్సాప్‌లో క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకునే సదుపాయం ఉచితంగా ప్రారంభమైంది.

వాట్సాప్‌లో క్రెడిట్ స్కోర్‌ని ఇలా చెక్ చేసుకోండి..

ఎక్స్‌పీరియన్ ఇండియా భారతదేశంలోని ఏదైనా క్రెడిట్ బ్యూరో ఇలాంటి సేవను అందించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. వినియోగదారులు వారి ఎక్స్‌పీరియన్ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయవచ్చు. వారి క్రెడిట్ పోర్ట్‌ఫోలియోను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఎక్స్‌పీరియన్ ఇండియా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్-2005 కింద లైసెన్స్ పొందిన దేశంలో మొట్టమొదటి క్రెడిట్ బ్యూరో. భారతీయ కస్టమర్‌లు తమ క్రెడిట్ స్కోర్‌ను వాట్సాప్‌లో ఉచితంగా చెక్ చేసుకోగలిగే సర్వీసును ఎక్స్‌పీరియన్ అందిస్తోంది.

క్రెడిట్ స్కోర్‌ని ఎప్పుడైనా చెక్ ఇలా చేయండి

ఈ కొత్త సర్వీస్ కింద కస్టమర్‌లు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోవచ్చని క్రెడిట్ బ్యూరో చెబుతోంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ని తనిఖీ చేయడానికి తక్షణ, సురక్షితమైన, సులభమైన మార్గం. రుణగ్రహీతలు తమ ఎక్స్‌పీరియన్ క్రెడిట్ నివేదికను తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఏదైనా అక్రమాన్ని ట్రాక్ చేయగలదు. ఇది మోసాన్ని కూడా గుర్తిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి మీరు తీసుకోవలసిన దశలు ఉన్నాయి.

 వాట్సాప్‌లో క్రెడిట్ స్కోర్‌ను ఎలా చెక్ చేయాలి 

ముందుగా మీరు ఎక్స్‌పీరియన్ ఇండియాకు చెందిన +91-9920035444 వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసి.., ఫోన్‌కి ‘Hi’ అని పంపాలి.

దీని తర్వాత మీరు మీ పేరు, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ వంటి మీ ప్రాథమిక వివరాలను పంచుకోవాలి.

దీని తర్వాత మీరు వాట్సప్ ద్వారా తక్షణమే మీ ఎక్స్‌పీరియన్ క్రెడిట్ స్కోర్‌ను పొందుతారు.

మీరు ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ పాస్‌వర్డ్ రక్షిత కాపీని అభ్యర్థించవచ్చు. అది మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ IDకి పంపబడుతుంది.

Thanks for reading You can easily check your CIBIL score on WhatsApp like this..

No comments:

Post a Comment