Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 1, 2023

AP BRAGCET 2023 APSWREIS 5th Class Admissions Notification, Online Application https://apgpcet.apcfss.in/


 AP BRAGCET 2023 APSWREIS 5th Class Admissions Notification, Online Application https://apgpcet.apcfss.in/

Update:9.05.23

5th Class Rank cards click Here

Inter Rank cards click Here

Update:26.04.23

Update:14.04.23

DR.B.R.Ambedkar Gurukulams AP Gurukulam APSWREIS 5th Class Admissions Hall Tickets 2023 

https://apgpcet.apcfss.in/swfifthhallticket

BRAG FIFTH CET Hall Tickets 2023 DATE OF ENTRANCE TEST: 23-04-2023

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 2023-24 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతిలో (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. 

ప్రవేశానికి అర్హత :

1) వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC, ST) విద్యార్ధులు 01-09-2009 నుండి 31-08 2013 మధ్య పుట్టి ఉండాలి. ఒ.సి., బి.సి., యస్.సి. కన్వర్టడ్ క్రిస్టియన్ (బి.సి.-సి) విద్యార్ధులు 01-09-2011 నుండి 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి..

2) విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో 2020-21 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2021-22 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

4) ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు. 

రిజర్వేషన్ల వివరాలు:

1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C 75%, S.C. కన్వర్టర్ క్రిస్టియన్లు 12%, S.T - 6%, B.C. - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.

2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, వెట్టి చాకిరీ నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.

3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కటగిరి విద్యార్ధులకు కేటాయిస్తారు.

5) ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును.

Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.

గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.

దరఖాస్తు చేయు విధానం:

ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.

తేదీ 25.02.2023 నుండి 24.03.2023 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. 

విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా ధరఖాస్తులు సమర్పించవలయున

దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు. 

ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.

ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

ఎంపిక విధానము:

2023-24 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 23.04.2023 న 10:00 am to 12.00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.


APBRAGCET APSWREIS 5th Class Admissions  Online application click here to Open

Official WebSite


5th Class Rank cards click Here

Inter Rank cards click Here

Thanks for reading AP BRAGCET 2023 APSWREIS 5th Class Admissions Notification, Online Application https://apgpcet.apcfss.in/

No comments:

Post a Comment