APPSC Group4: ఏప్రిల్ 4న గ్రూప్-4 మెయిన్స్
* 27 నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్
APPSC Group4: Group-4 Mains Hall tickets Here
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్‘(గ్రూప్-4 సర్వీస్, ప్రకటన నం.23/2021) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ప్రధాన పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను మార్చి 27 నుంచి కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా స్క్రీనింగ్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.
APPSC: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల
* ఏప్రిల్ 4న రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష
ప్రతిభడెస్క్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను మార్చి 27న విడుదల చేసింది. ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(గ్రూప్ 4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ ప్రధాన పరీక్షను ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో జరిపే కంప్యూటర్ పరీక్షకు 11,574 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుపనున్నారు.
APPSC Group4: Group-4 Mains Hall tickets Here
Thanks for reading APPSC Group4: Group-4 Mains on 4th April
No comments:
Post a Comment