ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..

అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి కేబినెట్‌లో అభినందనలు తెలిపారన్నారు.. ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు.
ఏపీ కేబినెట్‌లో ఆమోదించిన పలు అంశాలు ఇవే..
జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు
ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం
హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం
టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం
ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం
ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం
ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం
అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.
పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం
Thanks for reading Highlights of the AP Cabinet meeting @ 14.03.23
No comments:
Post a Comment