Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
తెలుగు సంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది మొదటి రోజును ఉగాది పండుగ చేసుకుంటారు. మరి, పర్షియన్, ఇరానీయన్ సంస్కృతిలో కొత్త ఏడాదిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసా..?
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రజలు జనవరి 1న కొత్త ఏడాది (New Year) శుభాకాంక్షలు చెబుతూ సంబరాలు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కొత్త సంవత్సరాది ప్రారంభమయ్యే రోజును ఉగాది (Ugadi) పండుగగా నిర్వహిస్తారు. తెలుగువారికి ఉగాది ఉన్నట్లుగానే.. ఇరానీయన్ సంస్కృతిలో నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజును ‘నౌరుజ్’(Nowruz) అని పిలుస్తారు. నౌరుజ్ అంటే ‘కొత్త రోజు’ అని అర్థం. మంగళవారం నౌరుజ్‌కు గుర్తుగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ Google కొత్త డూడుల్‌ను ఆవిష్కరించింది. మూడువేల సంవత్సరాల కిత్రం ఇరాన్, ఇరాక్, అఫ్గానిస్థాన్, తుర్కియే, సిరియా దేశాల్లోని పార్శీలతో పాటు కొన్ని వర్గాల వారు హిజ్రీ క్యాలెండర్ ప్రకారం శీతాకాలం పూర్తయి.. వసంత కాలం ఆరంభమయ్యే రోజున ఈ పండుగ జరుపుకొంటారు. ఆ రోజున వారంతా నౌరుజ్ వేడుకలు నిర్వహించేవారు. ఇప్పటికీ ఆయా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
Google నౌరుజ్ సందర్భంగా Google ప్రదర్శించిన డూడుల్‌ను వసంత కాలంలో విరిసే తులిప్, హైసింత్, డాఫోడిల్స్, బీ ఆర్కిడ్స్ పుష్పాలతో డిజైన్ చేశారు. ఐక్యరాజ్య సమితి (UN) సైతం నౌరుజ్‌ను అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఈ పర్వదినాన్ని మధ్య, పశ్చిమాసియా ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా నిర్వహిస్తారు. ‘‘గడిచిన కాలంలో స్మృతులను గుర్తుచేసుకుంటూ.. భవిష్యత్తుపై ఆశలతో బంధువులు, స్నేహితులతో బంధాలను మరింత బలోపేతం కావాలని పండుగ సందర్భంగా కోరుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త జీవితానికి గౌరవ సూచకంగా ఇళ్లను గుడ్లతో అలంకరించి.. కూరగాయలు, మూలికలతో విందు నిర్వహిస్తారు’’ అని Google పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ ప్రజలు నౌరుజ్ వేడుకను నిర్వహిస్తారని అంచనా. భారత్‌లో పార్శిలు పవిత్రమైన రోజుగా నౌరుజ్‌ను భావిస్తారు.
Thanks for reading Nowruz: Do you know about Google Doodle 'Nowruz 2023'?
No comments:
Post a Comment