Oscar 2023: వావ్.. భారత్‌కు మరో ‘ఆస్కార్’.. ఏ బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది .
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ వేడుకలో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. కార్తికి గోన్‌సాల్వెస్ ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ అవార్డ్‌ను కార్తికి గోన్‌సాల్వెస్ అందుకున్నారు.
ఇక ఈ షార్ట్ ఫిలిం విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’.
Thanks for reading Oscar 2023: Wow.. Another 'Oscar' for India.. 'The Elephant Whisperers' won the Oscar in the Best Short Film category
No comments:
Post a Comment