WhatsApp New Features: గ్రూప్ ఎక్స్పైరీ.. కాల్ మ్యూట్.. వాట్సాప్ రాబోయే ఫీచర్లివే!
WhatsApp Beta Features: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో ఆరు ఫీచర్లను సిద్ధం చేసింది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్లు త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తాయి.
వాట్సాప్ (WhatsApp)లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తుంటాయి. అలాగే త్వరలో రాబోతున్నాయి అంటూ ఓ జాబితా కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రచారంలో ఉండి, త్వరలో అందుబాటులోకి వస్తాయంటున్న ఆరు ఆసక్తికర వాట్సాప్ ఫీచర్ల గురించి చూద్దాం! (WhatsApp Beta Features)
వాట్సాప్‌లో చాలా మార్పులు జరుగుతున్నా.. అటాచ్‌మెంట్ సెక్షన్ మాత్రంలో పెద్దగా మార్పులు జరగడం లేదు. అయితే కొత్త వెర్షన్ (v2.23.6.17)లో అటాచ్‌మెంట్ పాప్ అప్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తున్నారు. మొబైల్‌లో నోటిఫికేషన్ ప్యానల్ తరహాలో ఐకాన్స్ మాదిరిగా ఉండబోతోంది.
వాట్సాప్‌లో ఓ వ్యక్తి పేరుతో సెర్చ్ చేస్తే.. అతడు సభ్యుడిగా ఉన్న గ్రూప్‌ల వివరాలు కూడా వస్తే.. బాగుంటుంది కదా! త్వరలోనే ఈ ఫీచర్‌ను మీరు చూడబోతున్నారు. బీటా వెర్షన్ వాట్సాప్‌లో ఈ మేరకు మార్పులు చేశారు. Groups in common పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ గ్రూపులో ఎవరు కావాలంటే వారు జాయిన్ అవ్వొచ్చు. ఆ గ్రూప్ ఇన్వైట్ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేసి గ్రూపులో చేరిపోవచ్చు. అయితే త్వరలో ఇది కుదరదు. ఎందుకంటే త్వరలో గ్రూపులో ఎవరైనా చేరాలంటే అడ్మిన్ ఓకే చేయాల్సిందే. గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్తే అక్కడ Pending participants అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కొత్త రిక్వెస్ట్‌లను చూడొచ్చు.
వాట్సాప్ గ్రూప్‌లో ఇతరుల ఛాటింగ్ దగ్గర ఆ వ్యక్తి పేరు వస్తుంది. అదే ఆ వ్యక్తి నంబర్ మీ మొబైల్‌లో లేకపోతే నంబరు వస్తుంది. అయితే దీని వల్ల ఆ మెసేజ్ చేసింది ఎవరు అని గుర్తించడం అంత ఈజీ కాదు. అయితే త్వరలో నంబర్ బదులు పేరు కనిపిస్తుంది. అంటే ఆ యూజర్ వాట్సాప్‌లో పెట్టుకున్న పేరు మీకు వస్తుందన్నమాట.
వాట్సాప్ గ్రూప్ ఇప్పటివరకు మెసేజ్‌లకు ఎక్స్పైరీ చూసి ఉంటారు. త్వరలో వాట్సాప్ గ్రూప్‌కే ఎక్స్పైరీ చూస్తారు. ఏదైనా అవసరం కోసం కొన్ని రోజులు తాత్కాలికంగా గ్రూప్‌ను క్రియేట్ చేసుకునేలా ఓ ఆప్షన్ తీసుకొస్తున్నారు. అంటే గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రూప్ ఎన్ని రోజులు ఉండాలి అనే ఆప్షన్ అడుగుతారు. అక్కడ మనం ఇచ్చే సమయం బట్టి ఆ గ్రూప్ లైవ్‌లో ఉంటుంది.
మీ కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి మీకు కాల్స్ వస్తే.. ఆ కాల్ మ్యూట్ అవ్వడం లేదంటే బ్లాక్ చేయడం లాంటివి చేయొచ్చు. చాలా మొబైల్స్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో వాట్సాప్‌లోకి తీసుకొస్తారు. అంటే అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వస్తే.. ఆ కాల్ మ్యూట్‌లోకి వెళ్లిపోతుంది. కాల్స్ లిస్ట్‌లోకి వెళ్లి అలాంటి కాల్స్ ఏం వచ్చాయి అనేది తర్వాత చూడొచ్చు.
గమనిక: ఈ కొత్త ఫీచర్లు ఇప్పటికే కొంతమంది బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. త్వరలో వినియోగదారులు వీటిని యాక్సెస్ చేయొచ్చు.
Thanks for reading WhatsApp New Features: Group Expiry.. Call Mute.. WhatsApp Upcoming Features!
No comments:
Post a Comment