AP Inter results 2023 updates : రేపు సాయంత్రం ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results) బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ(Vijayawada)లో సాయంత్రం 5గంటలకు ఇంటర్ ఫలితాల(Inter Results)ను విడుదల చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 9,20,552 మంది, ఒకేషనల్ విద్యార్థులు 83,749 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ ఇంటర్ ఫలితాలను bie.ap.gov.in వెబ్‌సైట్‌తో తెలుసుకోవచ్చు.
ఫలితాల కోసం
https://results.sakshieducation.com/
Thanks for reading AP Inter results 2023 updates
No comments:
Post a Comment