Fastrack Limitless FS1: రూ.1,995కే బ్లూటూత్ కాలింగ్‌తో ఫాస్ట్రాక్ స్మార్ట్‌వాచ్
Fastrack Limitless FS1: లిమిట్‌లెస్ ఎఫ్‌ఎస్1 పేరిట ఫాస్ట్రాక్ మరో స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. లాంఛ్ ఆఫర్ కింద దీన్ని రూ.1,995కు అందిస్తోంది.
దిల్లీ: అందుబాటు ధరలో ఫాస్ట్రాక్ మరో స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. లిమిట్‌లెస్ ఎఫ్‌ఎస్1 (Fastrack Limitless FS1) పేరిట తీసుకొస్తున్న ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. అడ్వాన్స్‌డ్ ఏటీఎస్ చిప్‌సెట్‌తో వస్తున్న దీంట్లో 1.95 అంగుళాల తెరను ఇస్తున్నారు. 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఇన్‌బిల్ట్ అలెక్సా సపోర్ట్ ఉంది. 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
పాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్‌ఎస్1 (Fastrack Limitless FS1) వాచ్ ధరను రూ.1,995గా నిర్ణయించారు. అయితే, ఇది లాంఛ్ ఆఫర్ కింద ఇస్తున్న ప్రత్యేక ధర. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో మాత్రం వెల్లడించలేదు. బ్లాక్, బ్లూ, పింక్ రంగుల్లో వాచ్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఫ్యాషన్‌లో ఏప్రిల్ 11 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. హార్ట్‌రేట్, పీరియడ్స్, స్లీప్‌ను మానిటర్ చేసే సెన్సర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్ప్రింటింగ్ వంటి 100 స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నట్లు పేర్కొంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంది.
Thanks for reading Fastrack Limitless FS1: Fastrack Smartwatch with Bluetooth Calling for Rs 1,995
No comments:
Post a Comment