Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 5, 2023

Identify Fake Land Registry


 Identify Fake Land Registry: మీ భూమి రిజస్ట్రేషన్ నిజమైనదా లేదా నకిలీదా ?

Identify Fake Land Registry: ప్రస్తుతం భూమి బంగారం కంటే విలువగా మారిపోయింది. ఈ క్రమంలో దేశంలో భూరిజిస్ట్రేషన్ కి సంబంధించిన స్కామ్‌లు, అక్రమాలు ఎక్కవ అయిపోయాయి.

చాలాసార్లు కొందరు ప్రభుత్వ భూమికి, అమ్మిన భూమికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అటువంటి మోసాలను నివారించడానికి ప్రతి వ్యక్తి నిజమైన, నకిలీ రిజిస్ట్రేషన్ల గురింది తెలుసుకోవడం అవసరం. వాస్తవానికి, ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత దాని యాజమాన్యాన్ని విక్రేత నుండి కొనుగోలుదారుకు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు.

భారతదేశంలో రిజిస్ట్రేషన్ అనేది చట్టపరమైన ప్రక్రియ. దీని ఆధారంగా భూమిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. అయితే ఈ సమయంలో కొందరు వ్యక్తులు భూమి కొనుగోలుదారుకు అవగాహన లేమిని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. భూమి రిజిస్ట్రీకి సంబంధించిన మోసాలు పలు రకాలుగా ఉంటాయి. ఒక అంచనా ప్రకారం, దేశంలో ప్రతి ఏడాది 40 శాతం నకిలీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు అంచనా. సాధారణంగా ప్రజలు భూమి రిజిస్ట్రీ, ఖతౌని పత్రాలను మాత్రమే చూస్తారు. కానీ, ఇది సరిపోదు ఎందుకంటే ఈ పత్రాలను చూడటం ద్వారా విక్రేతకు భూమిపై హక్కు ఉందా లేదా అని నిర్ధారించలేము.

ల్యాండ్ రిజిస్ట్రీలో మోసానికి సంబంధించిన కేసులను నివారించడానికి, ముందుగా భూమి సంబంధించిన కొత్త, పాత రిజిస్ట్రేషన్ పత్రాలను చూడాలి. మీకు భూమిని అమ్ముతున్న వ్యక్తి వేరొకరి నుండి భూమిని కొనుగోలు చేసి ఉంటే, ఆ భూమికి సంబంధించిన ఖతౌనిని తనిఖీ చేయాలి. ఖతౌనిలోని పత్రాలు అర్థం కాకపోతే న్యాయ నిపుణుడి సలహాను తీసుకోవాలి.

అలాగే, కన్సాలిడేషన్ 41, 45 రికార్డులను చెక్ చేయాలి. అప్పుడు ఈ భూమి ఏ వర్గానికి చెందినదో తెలుస్తుంది. 41, 45 రికార్డుల్లో ప్రభుత్వ భూమో లేక, అటవీ శాఖకో లేదా రైల్వేకి చెందినదా అనేది స్పష్టం అవుతుంది. కొన్నిసార్లు వీలునామా లేదా డబుల్ రిజిస్ట్రీ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు భూమి కొన్నా దానిపై పెండింగ్ కేసు లేకుండా చూసుకోండి. ఇది తహసీల్ నుండి భూమి డేటా నంబర్, భూమి యజమాని పేరు నుండి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా తనఖా పెట్టిన భూమి అంటే ఏ రకమైన రుణం ఉందో పరిశీలించి నిర్ధారించుకోవాలి. ఆ సమయంలో మీకు భూమి అమ్మే వ్యక్తికి దానిపై హక్కు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

Thanks for reading Identify Fake Land Registry

No comments:

Post a Comment