Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 19, 2023

Overtaking China.. India tops the world's largest population: UN


 చైనాను అధిగమించి.. ప్రపంచలో అత్యధిక జనాభాలో భారత్‌ టాప్‌: ఐరాస

 ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా భారత్‌ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, దానిని అధిగమించి భారత్‌ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఐరాస వెల్లడించింది. అంటే చైనా కంటే 29 లక్షల జనాభా భారత్‌లో ఎక్కువగా ఉందన్నమాట. 

1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఈ లిస్ట్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అయితే ఈ గణాంకాలపై భారత్‌ నుంచి అధికారిక నిర్ధారణ లేదు. ఎందుకంటే ప్రతీ పదేళ్లకొకసారి భారత్‌లో జనాభా లెక్కల ప్రక్రియను కేంద్రం చేపడుతుంది. అయితే.. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. 

మరోవైపు చైనాలో 2022లో జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 1960 తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే. అక్కడి పరిస్థితులు, చట్టాలు అందుకు కారణం కాగా, జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సైతం విఫలమవుతున్నాయి. 2022లో ఏకంగా 8,50,000 జనాభా తగ్గిపోయింది అక్కడ. 

యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ బుధవారం ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిసెస్' పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. భారత్‌, చైనా తర్వాత జనాభాలో అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్‌లు ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నాయి.

Thanks for reading Overtaking China.. India tops the world's largest population: UN

No comments:

Post a Comment