Airtel Postpaid plans: OTT బెనిఫిట్స్‌తో ₹599కే ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్..!
Airtel Postpaid plans: ఎయిర్‌టెల్ పలు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. దీంట్లో రూ.599 ప్లాన్‌కు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ తెలిపింది. మరి దీంట్లో ప్రయోజనాలు, ఫీచర్లేంటో చూద్దాం..!
మార్చిలో తీసుకొచ్చిన నెలవారీ రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాటినం ఫ్యామిలీ ప్లాన్ (Airtel Platinum Plan)కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఎయిర్‌టెల్ సీఈఓ ఇటీవల మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న సందర్భంలో వెల్లడించారు. 5జీ సేవల విస్తరణలో ఈ ఫ్యామిలీ ప్లాన్లు కీలక పాత్ర పోషించనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రూ.599 ప్లాన్‌నే యూజర్లు కపుల్ ప్లాన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఫీచర్లు: ఈ ప్లాన్‌లో ఉండే ఫీచర్లు, ప్రయోజనాలన్నింటినీ ఇద్దరూ ఎంజాయ్ చేయొచ్చు. ప్రైమరీ యూజర్ ఈ ప్లాన్‌ను మేనేజ్ చేస్తూ ఉంటారు. కావాల్సినప్పడు మరొక కుటుంబ సభ్యుణ్ని దీనిలో యాడ్ చేయడం లేదా తొలగించడం చేయొచ్చు. ఎవరు ప్లాన్‌లోకి కొత్తగా వచ్చినా.. సెకండరీ యూజర్ కోటా కింద ఉన్న డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్‌లో ఉన్న ఇద్దరికీ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. డేటా విషయానికి వస్తే ఇద్దరికీ కలిపి 105 జీబీ డేటా లభిస్తుంది. దీంట్లో 75 జీబీ ప్రైమరీ యూజర్‌కు, మిగిలిన 30 జీబీ సెకండరీ యూజర్ కోటాలో ఉంటుంది. వినియోగించని డేటాను మరుసటి నెలకు 200జీబీ వరకు బదిలీ చేసుకునే వీలు కూడా ఉంది.
ఓటీటీ సర్వీస్‌లు: అమెజాన్ ప్రైమ్ ఆరు నెలల సభ్యత్వం, ఏడాదిపాటు డిస్నీ-హాట్‌స్టార్ మొబైల్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తాయి.
యాడ్- ఆన్ సదుపాయం: ఈ రూ.599 ప్లాన్‌పై ఎయిర్‌టెల్ యాడ్- ఆన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రైమరీ, సెకండరీ యూజర్లతో పాటు మరో 8 మంది కుటుంబ సభ్యులను ప్లాన్‌లో యాడ్ చేసుకోవచ్చు. ప్రతి కనెక్షన్‌కు రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి వ్యక్తికి 30 జీబీ డేటా అదనంగా లభిస్తుంది.
ఇతర ప్రయోజనాలు: ఉచిత హలోట్యూన్స్, వింక్ ప్రీమియం, ఏడాది పాటు అపోలో 24/7 సేవలను పొందొచ్చు. వీటితో పాటు ఎయిర్‌టెల్ స్టోర్లు, కస్టమర్ కేర్ సెంటర్లలో వీఐపీ సర్వీస్ కింద ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
Thanks for reading Airtel Postpaid plans : 599/- Airtel Family Plan with OTT benefits .. !
No comments:
Post a Comment