Day 10: Students Summer Holidays Activities
Students Summer Holidays Activities - - Summer vacation- summer activities
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:10 Activities
💎 నేటి ఆణిముత్యం
తనయూరి తపసి తనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
తన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!
భావం :ఎంత వివేకం ఉన్న మనుష్యులయినప్పటికీ సొంత ఊరికి చెందిన తపశ్శక్తి సంపన్నుడినీ, కన్న కొడుకు ప్రదర్శించే తెలివితేటలను, సొంత భార్య అందచందాలను, ఇంటి పెరడులో ఉన్న చెట్టుయొక్క ఔషధగుణాలను మనస్సులో కూడా మెచ్చుకోరు.
ప్రతిపదార్థం : తన + ఊరి అంటే తను నివసించే గ్రామానికి చెందిన. తపసి అంటే తపస్సు చేసే వాని యొక్క. తపమును అంటే తపస్సును. తన పుత్రుని అంటే తన సొంత కుమారుని యొక్క. విద్య పెంపున్ అంటే చదువులో గల తెలివితేటలను. తన సతి అంటే తన భార్య యొక్క. రూపున్ అంటే సౌందర్యాన్ని. తన పెరటి అంటే తన ఇంటి పెరడులో ఉన్న. చెట్టుమందును అంటే ఔషధ వృక్షాలను. ఎట్టి అంటే ఎంత వివేకం ఉన్న. మనుజులున్ అంటే మనుష్యులు అయినప్పటికీ. మనసునన్ అంటే చిత్తంలో. వర్ణింపరు అంటే ప్రశంసించరు లేదా మెచ్చుకోరు.
పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది... అని సామెత ఉండనే ఉంది. తమ కుమారుడు ఎంత తెలివిగలవాడైనప్పటికీ, పక్కింటి అబ్బాయిని మెచ్చుకుంటారు. తమ గ్రామంలోనే ఎంతో పండితుడు ఉన్నప్పటికీ అతడిని గుర్తించరు. తన భార్య ఎంత అందంగా ఉన్నా కూడా పక్కింటి భార్య అందాన్నే పొగుడుతారు. అలాగే తమ ఇంట్లోనే ఔషధవృక్షం ఉన్నా కూడా దానిని ఔషధంగా అంగీకరించరు. అందుకే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అని, దూరపుకొండలు నునుపు అని అంటారు. అందుబాబులో ఉన్నవాటిని నిర్లక్ష్యం చేసి అందని ద్రాక్షల కోసం ప్రయత్నించడం మానవ లక్షణం. ఈ పద్యంలో కవి ఆ విషయాన్ని వివరించాడు.
🤘నేటి సుభాషితం
మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది.ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.
👬 నేటి చిన్నారి గీతం
ఓరోరి వెంకన్న
ఓరోరి వెంకన్న - మెట్లపల్లి వెంకన్న
ఎద్దును తెమ్మంటే - ఎలుకను తెచ్చె
కాల్చుకు రమ్మంటే - మాడ్చుకు వచ్చె
పై చూడమంటే - సగం మింగి తెంచె
ఆగాగు మంటే - అయింతా తినె
ఓరోరి వెంకన్న తిండిపోతు వెంకన్న
🤠 నేటి సామెత
రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
రామాయణం విన్న తరువాత ఎవరైనా రామునికి సీత ఏమౌతుందని అడిగితే ఆ ప్రశ్న విన్నవారికి విచిత్రంగా ఉంటుంది. అదే విధంగా ఏదైనా విషయం కూలంకుశంగా విన్న తరువాత ఆ విషయం గురించి ఏమీ తెలియనట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఈ సామెతను వాడుతారు.
🗣నేటి జాతీయం
ఇనుప గజ్జెల తల్లి
దరిద్రదేవతకు ఇది మారు పేరు. ఆ ఇంట్లో ఇనుపగజ్జెల తల్లి నాట్యమాడుతున్నది. అని అంటారు. అనగా ఆఇంట్లో దారిద్ర్యం ఉన్నదని అర్థం.
✍🏼 నేటి కథ
ఆడైనా.. మగైనా.. సింహం.. సింహమే!
మారేడుపల్లి అడవికి రాజైన సింహం ఒకరోజు హఠాత్తుగా అనారోగ్యంతో మరణించింది. దీంతో అడవిలోని జంతువులన్నీ బాధతో తల్లడిల్లిపోయాయి. కొన్నిరోజుల తరువాత బాగా ఆలోచించి జంతువులన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. ఈ అడవిని పాలించడానికి రాణి సివంగినే సమర్థురాలు అని నిర్ణయించుకున్నాయి. ఆ విషయాన్ని సివంగితో చెప్పాయి.
వాటిలో పులి, నక్క తోడేలుకు అది ఏమాత్రం నచ్చలేదు. వాటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాయి. నక్క, తోడేలు ముందుకు వచ్చి.. ‘ఏమిటీ విడ్డూరం.. ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? ఒక ఆడసింహం అడవిని పాలించడమా? మేం దీనికి ఒప్పుకోం. మా స్నేహితుడైన పులినే రాజుగా ఎన్నుకోండి’ అన్నాయి.
దానికి జంతువులన్నీ కోపంగా.. ‘లేదు.. లేదు.. ఎవరికీ సాయం చేయకుండా చెడు చేసే ఆ దుష్ట పులిని మహారాజుగా ఎన్నుకోవాలా? దానికి మేం అస్సలు ఒప్పుకోం’ అన్నాయి.
అంతలో ఓ ఏనుగు ముందుకు వచ్చి.. ‘ఏమిటి.. మీరు మాట్లాడుతోంది. రాణి సివంగి అడవిని పాలించడంలో మీకు అభ్యంతరం ఏంటి? ఎంతో తెలివైన మనుషుల్లో కూడా ఆడ, మగ అనే తేడా లేకుండా.. ఇప్పుడు మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కష్ట సమయాల్లో తమ రాజ్యాలను రాణి రుద్రమదేవి, రాణి ఝాన్సీలక్ష్మీబాయి వంటి వారు ఎందరో ఎంతో గొప్పగా పరిపాలించారు. అటువంటిది మన అడవిలో అందరికీ మేలు చేసే రాణి సివంగిని పాలకురాలిగా ఎన్నుకోవడంలో తప్పు ఏముంది?’ అంది.
అయినప్పటికీ నక్క, తోడేలు ఇంకా మూర్ఖంగా వాదిస్తూ.. ‘అదంతా మాకు తెలియదు. సివంగి మమ్మల్ని పాలించడానికి మేము ఎంత మాత్రమూ ఒప్పుకోం. మా స్నేహితుడు పులి ఈ అడవిలో అన్ని జంతువుల కంటే బలవంతుడు. ఆ సివంగి ఈ పులితో పోరాడి గెలిస్తే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం. ఒక వేళ మా స్నేహితుడు గెలిస్తే, మా మాటలను మీరు ఒప్పుకోవాలి’ అన్నాయి.
జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి. అంతలో రాణి సివంగి ముందుకు వచ్చి నా మీద నమ్మకం పెట్టుకున్న నా జంతువుల మీద అభిమానంతో నేను ఆ పులితో పోరాటం చేస్తాను అని ధైర్యంగా చెప్పింది.
దానికి జంతువులన్నీ రాణి సివంగిని ఎంతో అభినందించి ప్రోత్సహించాయి. పులి, నక్క, తోడేలు తమదే గెలుపు అని గట్టి నమ్మకంతో ఉన్నాయి. కాసేపటికి పులి, రాణి సివంగి మధ్య పోరాటం మొదలైంది. రెండూ భీకరంగా కొట్టుకుంటున్నాయి. కొద్దిసేపటికి సివంగిలో కాస్త శక్తి సన్నగిల్లింది. జంతువులన్నీ ఎంతో బాధ పడ్డాయి. ఎలాగైనా సివంగిని చంపేయాలని పులి ముందే నిశ్చయించుకుంది.
రాణి సివంగి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా లేచి శక్తిని కూడగట్టుకుంది. తాను కొత్తగా ఏనుగు దగ్గర ఆత్మ రక్షణ కోసం రహస్యంగా నేర్చుకున్న ఒక యుద్ధ విద్యను ఆ పులిపై ఆఖరి అస్త్రంగా ప్రయోగించింది. దెబ్బకు పులి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్న జంతువులన్నీ ఆశ్చర్యానికి గురై, రాణి సివంగికి జేజేలు పలికాయి. తీవ్రగాయాలపాలై పులి, అవమాన భారంతో నక్క, తోడేలు అక్కడి నుంచి వేరే అడవిలోకి పారిపోయాయి. అది చూసి మిగతా జంతువులు సంబరాలు చేసుకున్నాయి.
✅తెలుసు కుందాం
🟥సోలార్ బేటరీ ఎలా పనిచేస్తుంది?,How does SolarBatary work?
🟩సూర్యని కాంతి శక్తిని విద్యుచ్చక్తి గా మార్చడమే సౌర ఘటాల (SolarBataries) పని . ఆ విద్యుత్ ను ఏ ప్రయోజనము కోసం వాడతామనే విసయాన్ని బట్టి అవి పనిచేసే విధానము కుడా మారుతుంది . కొన్ని సౌరఘటాలు ఎప్పటికప్పుడు కాంతి శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తూ పరికరాలను నడిపిస్తుంటాయి . కేవలం తక్కువ మోతాదు విద్యుత్ మాత్రమే అవ సరమయ్యే కాలిక్యులేటర్లు ,డిజిటల్ గడియారాల్లాంటివి ఈ విధానం లో పనిచేస్తాయి . చీకటిలో ఇవి పని చేయవు . ఇక ఎక్కువ విద్యుత్ కావాల్సిన బల్బులు , యంత్రాలు , టార్చిలైట్లు , వీదిలైట్లు పని చేయాలంటే తొలుత కాంతి శక్తిని చాలా గంటల పాటు విధుత్ శక్తి గా మారుస్తూ నిలువున్చుకునే విధానాని వాడతారు . సినికాన్ వంటి పదార్ధాలలోని ఎలక్ట్రాన్లు కాంతి శక్తివల్ల ఉత్తేజితమై ఒక శక్తి స్థాయి నుంచి పైశక్తి స్థాయికి మారుతూ ధన , రుణ విద్యుత్దావేశాల్ని ఏర్పరచ గలవు . ఇలాంటి ఘటాలను వందలాదిగా వరుసగా కలపడం ద్వారా కొంత మోతాదులో ''విద్యుత్ పోటన్సియాల్'' ఏర్పడుతుంది .
Thanks for reading Day 10: Students Summer Holidays Activities
No comments:
Post a Comment