Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 15, 2023

Day 16: Students Summer Holidays Activities


  

Day 16: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:16 Activities

Class: 1,2
16 వ రోజు 

To develop collection and creativity skills

Q) Collect some leaves of plants and make pictures of animals, fruits, flowers etc

తెలుగు:

Q) అక్షరాలలో తేడాను గుర్తిస్తూ పదాలను చదవండి. రాయండి.

జింక - జీడి
దివి - దీపం
పిడి - పీట
లిపి - లీల
విమల - వీణ

English:

Q) Write the missing letters.

H - t           🛖

H - u - e      🏠

H a - d        ✋

H - m - e r   🔨

H o - s e       🐎

Maths:

Q) Write the following numbers in Ascending order. ( Smallest to Biggest )

1) 87, 99, 83

2) 615, 611, 616

3) 828, 621, 726

4) 505, 709, 402

5) 856, 853, 858

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Give = ఇచ్చుట.

Most = చాలా.

Very = ఎక్కువ.

After = తరువాత.

Thing = వస్తువు.

Our = మనది, మన.

Just =న్యాయమైన, ఇప్పుడే.

Name = పేరు.

Good = మంచి.

Sentence  =వాక్యము.

Man = మనిషి.

Thin = పలుచని.

Say = చెప్పుట.

Great = గొప్పదైన.

Where = ఎక్కడ.











Class :3,4,5
16వ రోజు 

Q) కుందేలు మరియు తాబేలు  కథను చదువుతూ మీ నోటు పుస్తకం లో రాయండి.

Q) Read and write the story 'The hare and the tortoise' in your note book.







💎నేటి ఆణిముత్యం

"ఒక్క రోజీవు వీడుల సూడ్వకున్న
తేలిపోవును మా పట్టణాల సొగసు !
బయటపదునమ్మ ! బాబుల బ్రతుకులెల్ల
ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప."
 
భావము:

  ఒక్క రోజు పారిశుధ్య కార్మికులు పట్టణాలలో వీధులను ఊడ్చకపోతే,పట్టణాల అందం పోతుంది.వీళ్ళు ఒక్కరోజు పనిచేయకపోతే  గొప్పలు చెప్పుకునే పాలకులు బతుకులు ఒక్క నిమిషం లో బయటపడతాయి.
👬 నేటి చిన్నారి గీతం

నల్ల సూర్యుడు

ఇష్టదేవతకు దండం పెట్టి   
గనిలోకి నువు అడుగుబెట్టి      
బళ్ళున బొగ్గు కూలుత ఉంటే    
ప్రాణాలకు వెనుకాడక నువ్వు    
రక్తమాంసాలు చెమటగ మార్చి       
టబ్బుల్లోన బొగ్గు నింపుతావు   
జాతికి వెలుగులు అందిస్తావు      
నల్ల సూర్యుడై వెలుగొందుతావు
🤘నేటి సుభాషితం

తెలివైనవారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు. వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు.

🤠 నేటి సామెత 

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నదట

ఏదైనా ఒక పని చెయ్యాలంటే ప్రతీ మనిషికి ఎంతో కొంత సామర్థ్యం వుండాలి. ప్రతిపనీ చేసేస్తానని గొప్పలు పోతే అందరిలోను నవ్వులపాలు కాక తప్పదు. అలాంటి సందర్భంలో వచ్చే సామెతే ఇది.ఇంట్లో చూరికి వున్న ఉట్టి ఎగిరి అందుకోలేని ఆవిడ ఆకాశం లోని స్వర్గాన్ని అందుకోలేదుకదా. అలాగే చిన్న పని చెయ్యలేని వారు వారి సామర్ధ్యానికి మించిన పని చేస్తానంటే వారిని వేళాకోళం చేస్తూ అనే మాట ఇది.

🗣నేటి జాతీయం

అన్నం, నీళ్లు పట్టించుకోకుండా

ప్రతిరోజూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది. 'తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

✍🏼 నేటి కథ 

పులి వన్నె నక్క!

ఒక చిట్టడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలనేది దాని కోరిక. ఒక రోజు పొరుగున ఉన్న ఒక పెద్ద అడవికి ఆ నక్క వెళ్లింది. అక్కడ ఒక పొదలో పులి చచ్చిపడి ఉంది.
నక్కకు ఒక ఆలోచన వచ్చింది. పులి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి పులి మాంసాన్ని తినేసింది. ఆ చర్మాన్ని తీసుకెళ్లి ఒక కొలనులో బాగా కడిగి ఎండబెట్టింది. అక్కడకు కొన్ని కొంగలు చేరి ‘ఏమిటి విశేషం?’ అని అడిగాయి.
‘శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి ఈ పులి తోలు నాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరు దీన్ని జాగ్రత్తగా కుట్టి నాకు ఇవ్వండి. నన్ను మిత్రుడిగా భావించి నాకు ఈ సాయం చేసిపెట్టండి. నా వల్ల మీకు ఏ అపకారమూ ఉండదు. అంతేకాదు.. మిగతా జంతువులు, పురుగూపుట్రా నుంచి కూడా మీకు అపకారం జరగకుండా చూసుకుంటాను’ అని చెప్పింది నక్క.
‘ఇదేదో బాగుంది’ అనుకుంటూ కొలను పరిసరాల్లో ఉన్న సన్నని తీగలను తెచ్చి తమ నైపుణ్యం ఉపయోగించి నక్క శరీర కొలతలకు సరిపడేలా పులితోలుతో చక్కని జుబ్బా కుట్టాయి కొంగలు.
పులితోలు జుబ్బాతో చిట్టడవి చేరిన నక్క ఒక రహస్య ప్రదేశానికి వెళ్లింది. అక్కడ దాన్ని తొడుక్కొని.. ఎవరికీ అనుమానం రాకుండా జుబ్బాను సవరించుకుని గట్టిగా కట్లు కట్టుకుంది. ఒక నీటిగుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తాను అచ్చం పులిలా కనిపిస్తున్నాను అని నిర్ధారించుకున్న తరవాత ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది.
పులితోలు కప్పుకున్న నక్కను చూసిన జీవులు సంభ్రమాశ్చర్యాలు చెందాయి. ‘చిట్టడవిలో పులా?’ అని గుసగుసలాడుకుంటూ ఆ వార్తను చిట్టడవి మొత్తానికి చేర్చాయి. చిట్టడవిలోని సమస్త జీవరాశీ ఆ చెట్టు దగ్గరకు చేరింది. ‘చిట్టడవికి పులి రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఇకపై మీరే మా అడవికి రాజు’ అని ప్రకటించాయి.
నక్క మురిసి పోయింది. అయితే బరువైన పులి తోలు కప్పుకున్న తాను అడవిలో తిరగడానికి ప్రయత్నించి చతికిలపడితే అసలుకే మోసం వస్తుందని ఆలోచించింది. ‘మిత్రులారా..! మీ అందరి కోరిక మేరకు నేను ఈ చిట్టడవిలోనే ఉండిపోయి, వేటగాళ్ల నుంచి మీకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. ఒక పెద్ద అడవిలో ఒక సింహంతో పోరాడి విజయం సాధించాను. కానీ దాని పంజా దెబ్బలకు నా చర్మం చిట్లి.. ఒళ్లంతా కట్లుకట్టుకున్నాను. బహుశా నేను ఇక జీవితంలో దూరాభారాలు నడవలేను, వేటాడలేను. నాకు ముసలితనమూ వచ్చింది. గొంతులోనూ మార్పు వచ్చింది. ఎలాగూ నన్ను ఈ అడవికి రాజును చేశారు కాబట్టి.. నాకు కావాల్సిన ఆహారాన్ని రోజూ తెచ్చిపెట్టండి’ అని కోరింది.
ఆ రోజు నుంచి ఆ నక్కకు కావాల్సిన ఆహారాన్ని వంతుల వారీగా తెచ్చి ఇచ్చేవి ఆ చిట్టడవి జీవులు. తన పాచిక పారినందుకు నక్క చాలా సంతోషించింది. ఈ అమాయక చిట్టడవి జీవరాశి మధ్య తన శేష జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది అనుకుంది ఆ నక్క. అయితే తాను కప్పుకున్న పులి తోలును కలలో కూడా తొలగించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.
రోజురోజుకూ ఆ నక్క అహంకారం ఎక్కువై.. తనకు ఆహారం తెస్తున్న జీవులపైనే జులుం చెలాయించేది. ఇంకా రుచికరమైన భోజనం తెమ్మని ఆదేశాలు ఇచ్చేది. లేదంటే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించేది. ‘ప్రశాంతంగా ఉండే చిట్టడవిలోకి అనవసరంగా ఈ ముసలి పులిని ఆహ్వానించి, రాజును చేసి తప్పు చేశాం అనిపిస్తుంది’ అని మదనపడ్డాయి ఆ జీవులు.
ఒక రోజు కొన్ని పావురాలు నక్కను పలకరించగా తన శరీరంపై క్రిమికీటకాలు ఉంటే ఏరిపారేయమని కోరింది. పావురాలు ఆ పనిచేస్తుండగా అసలు రహస్యం బయటపడింది. ‘ఇది పులితోలు కప్పుకున్న నక్క’ అని ఇట్టే గ్రహించాయి ఆ పావురాలు. అవి కొన్నిరోజులపాటు మిగతా జంతువులతో సమాలోచనలు జరిపి, ఒక ఎత్తుగడ వేశాయి.
ఒక తొండ నక్క దగ్గరకు వచ్చి ‘ఓ రాజా! మీకు నిత్యం అన్యాయం జరుగుతోంది. ఈ అడవిలోకి కొన్ని నక్కలు చేరాయి. అవి బలమైన జీవులను వేటాడి.. ఆ నాణ్యమైన మాంసాన్ని ఆరగించేసి తమకు మాత్రం ఒట్టి ఎముకలను పంపిస్తున్నాయి. పైగా ఆ ముసలి పులి మనల్ని ఏమీ చెయ్యలేదులే.. దాని ఒంటి నిండా సింహం పంజా దెబ్బలే అని మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుకుంటున్నాయి’ అని చెప్పి, దూరంగా ఉన్న పొదల్ని చూపించింది. నక్కకు పట్టరాని కోపం వచ్చి ‘ఇప్పుడే ఆ నక్కలపై దాడి చేసి చంపేస్తాను’ అంటూ చివాలున లేచి పొదలవైపు పరుగు పెట్టింది. అంతే తాను కప్పుకున్న పులితోలు బాగా ముక్కిపోయి, చివికిపోయి ఉండడంతో చీలికలు, పీలికలుగా ఊడిపోయింది.
నక్క బండారం బయటపడింది. అక్కడే మాటు వేసి ఉన్న మిగతా జంతువులన్నీ నక్కను ఆ అడవి నుంచి తరిమేశాయి. ‘తన దురాశ వల్లే ఇదంతా జరిగిందని’ బాధపడుతూ నక్క ఆ అడవి నుంచి దూరంగా పారిపోయింది.

తెలుసు కుందాం

🟥భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?

🟩చెమట పట్టడం అనేది చర్మం ఉపరితలంలో నిర్విరామంగా జరిగే ప్రక్రియ. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు చెమటను స్రవింపచేస్తూ ఉంటాయి. అలా చర్మం పైకి వచ్చే చెమట వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు గాలిలోకి ఆవిరైపోతూ ఉంటుంది. ఇలా ఆవిరవడం గాలిలోని నీటి శాతంపై అంటే తేమపై ఆధారపడి ఉంటుంది. తేమ శాతం తక్కువగా ఉంటే ఆవిరయ్యే ప్రక్రియ త్వరగా జరుగుతుంది. అదే వర్షం వచ్చే ముందు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో అప్పటికే బోలెడు తేమ ఉండటం వల్ల ఇక ఏ మాత్రం తేమను అది ఇముడ్చుకోలేదు. అందువల్ల శరీరంపైకి చేరే చెమట ఆవిరి కాకుండా అక్కడే ఉండిపోతుంది. అపుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపించి చెమటలు కారిపోతాయన్నమాట.

Thanks for reading Day 16: Students Summer Holidays Activities

No comments:

Post a Comment